డిఫెన్స్ మినిస్ట్రీ పర్మిషన్ జాన్వీకి దొరుకుతుందా..?

Published : Apr 26, 2019, 02:20 PM IST
డిఫెన్స్ మినిస్ట్రీ పర్మిషన్ జాన్వీకి దొరుకుతుందా..?

సారాంశం

బాలీవుడ్ లో దేశభక్తికి సంబంధించిన సినిమా కథలతో ఎక్కువగా సినిమాలను తీస్తున్నారు. 

బాలీవుడ్ లో దేశభక్తికి సంబంధించిన సినిమా కథలతో ఎక్కువగా సినిమాలను తీస్తున్నారు. ఈ నేపధ్యంలో వచ్చిన సినిమాలు సక్సెస్ అవుతుండడంతో దర్శకనిర్మాతలు అటువంటి కథలపై దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలో నటి జాన్వీ కపూర్ 'కార్గిల్ గర్ల్' అనే సినిమాలో నటిస్తోంది.

అయితే ఈ సినిమాకు సంబంధించి చిత్రబృందం దేశ రక్షణ మంత్రిత్వ శాఖ నుండి అనుమతి తీసుకోవాల్సివుంది. కానీ పర్మిషన్స్ తీసుకోకుండానే షూటింగ్ మొదలుపెట్టేసింది చిత్రయూనిట్. రీసెంట్ గా డిఫెన్స్ మినిస్ట్రీ పర్మిషన్ కోరుతూ దరఖాస్తులు చేశారు. 

ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు ప్రాసెస్ లో ఉన్నాయి. ఇండియన్ తొలి ఎయిర్‌ఫోర్స్ ఉమెన్ పైలట్ గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఫిబ్రవరి సినిమా షూటింగ్ లక్నోలో మొదలైంది.

ఈ సినిమాలో జాన్వీ.. గుంజన్ సక్సేనా పాత్రలో నటిస్తుండగా ఆమెకి సోదరుడి పాత్రలో అంగద్ బేడీ నటిస్తున్నాడు. జాన్వీ తండ్రిగా పంకజ్ త్రిపాఠి కనిపించనున్నాడు. శరన్ శర్మ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?