ప్రియుడికి పబ్లిక్ గా లిప్ కిస్ ఇచ్చేసిన ప్రముఖ నటి!

Published : Apr 26, 2019, 12:42 PM IST
ప్రియుడికి పబ్లిక్ గా లిప్ కిస్ ఇచ్చేసిన ప్రముఖ నటి!

సారాంశం

హిందీ టీవీ రంగంలో నటిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న అంకిత లోఖండే.. ఇటీవల 'మణికర్ణిక' చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 

హిందీ టీవీ రంగంలో నటిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న అంకిత లోఖండే.. ఇటీవల 'మణికర్ణిక' చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె పోషించిన జుల్కరి బాయ్ పాత్రకి మంచి పేరు దక్కింది.

గతంలో నటుడు సుశాంత్ రాజ్ పుత్ సింగ్ తో ప్రేమాయణం సాగించిన ఈ బ్యూటీ మూడేళ్ల క్రితం అతడితో విడిపోయింది. ఇటీవల కాలంలో ఆమె ముంబైకి చెందిన వ్యాపారవేత్త విక్కీ జైన్ తో సన్నిహితంగా ఉంటున్నట్లు వాస్తలు వచ్చాయి.

ఈ విషయంపై స్పందించిన ఆమె విక్కీ జైన్ ని ప్రేమిస్తున్నట్లు చెప్పింది. అతడు చాలా మంది వ్యక్తని.. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు వెల్లడిస్తానని తెలిపింది. ఒకవేళ పెళ్లి చేసుకుంటే అందరినీ పిలిచే చేసుకుంటానని.. ప్రస్తుతానికి అటువంటి ప్లాన్స్ లేవని చెప్పింది.

తాజాగా ఈ జంట తమ స్నేహితుల ఇంట పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి డాన్స్ చేస్తూ సందడి చేశారు. ఈ సందర్భంలో అంకిత తన ప్రియుడు విక్కీని దగ్గరకు తీసుకొని అందరూ చూస్తుండగానే ముద్దు ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 


 

PREV
click me!

Recommended Stories

Chiranjeevi: చిరంజీవితో నటించి స్టార్ హీరోలని పెళ్లి చేసుకున్న హీరోయిన్లు.. ఒకరైతే అందరికీ బిగ్ సర్ప్రైజ్
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు లాఠీ ట్రీట్, బెంగళూరులో ఏం జరిగింది?