“నారప్ప” ఓటిటి డీల్ కాన్సిల్ అప్ప?

By Surya PrakashFirst Published Jul 9, 2021, 2:20 PM IST
Highlights


శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియమణి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ చిత్రాన్ని ఓటిటిలో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేయాలనుకున్నారు సురేష్ ప్రొడక్షన్స్ వారు. 


కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే విడుదల కావాల్సిన చాలా చిత్రాలు విడుదల కాలేదు. వాటిల్లో విక్టరీ వెంకటేష్ నటించిన రెండు చిత్రాలు “నారప్ప”, “దృశ్యం-2” ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే.  అయితే వెంకీ అభిమానులకు షాకిస్తూ ఆయన నటించిన చిత్రాలను ఓటిటిలో విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారు మేకర్స్. తమిళంలో ధనుష్ హీరోగా రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ “అసురన్”కు రీమేక్ గా “నారప్ప” తెరకెక్కింది. 

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియమణి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ చిత్రాన్ని ఓటిటిలో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేయాలనుకున్నారు సురేష్ ప్రొడక్షన్స్ వారు.  “నారప్ప”ను ఓటిటిలో విడుదల చేయడానికి పాపులర్ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ తో భారీ డీల్ కుదుర్చుకున్నారట. అయితే ఇప్పుడా డీల్ ని కాన్సిల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

పెద్ద సంస్దలు సైతం సినిమాలను ఓటిటిలకు అమ్మేసుకోవడం పట్ల డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల నుండి చాలా వ్యతిరేకత వస్తోంది. తన  ఇమేజ్ కోసమో, మరొకటో కారణం కానీ ఇప్పుడు సురేష్ బాబు మరోసారి ఓటిటి టీమ్ తో చర్చలు జరుపుతున్నాడట. వాళ్ళు కూడా డీల్ ను వెనక్కి తీసుకోవడంపై పాజిటివ్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రాన్ని సమర్పిస్తోన్న థాను మాత్రం థియేట్రికల్ రిలీజ్ పై అంత సముఖంగా లేడని అంటున్నారు. “నారప్ప, దృశ్యం-2” చిత్రాలను వెండితెరపై చూడాలని ఎదురు చూస్తున్నారు వెంకీ ఫ్యాన్స్.  

ఈ చిత్రం మాత్రమే కాకుండా  రానా దగ్గుబాటి “విరాటపర్వం” చిత్రాలను కూడా ఓటిటిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని వార్తలు వచ్చాయి. కొన్ని రోజుల్లోనే ఈ సినిమాల రిలీజ్ విషయమై క్లారిటీతో అధికారిక ప్రకటన రానుంది అంటున్నారు.  

click me!