పటౌడీ ప్యాలెస్‌లో కరీనా బర్త్‌డే సెలబ్రేషన్స్..!

Published : Sep 21, 2019, 12:05 PM IST
పటౌడీ ప్యాలెస్‌లో కరీనా బర్త్‌డే సెలబ్రేషన్స్..!

సారాంశం

బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఈరోజు తన 39వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా తన భర్త సైఫ్ అలీ ఖాన్‌తో కలిసి పటౌడీ ప్యాలెస్‌లో ఘనంగా వేడుకలు జరుపుకొన్నారు.  

నేడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ 39వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. భర్త సైఫ్ అలీ ఖాన్, కుమారుడు తైమూర్ అలీ ఖాన్‌తో కలిసి తన పుట్టినరోజు వేడుకల కోసం రెండు రోజుల ముందే హరియాణాలోని పటౌడీ ప్యాలెస్‌కు చేరుకున్నారు కరీనాకపూర్. 

శుక్రవారం అర్థరాత్రి సైఫ్.. కరీనా కోసం సర్ప్రైజ్ బర్త్ డే పార్టీని ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో కరీనా సోదరి కరిష్మా కపూర్ ఆమె కుటుంబసభ్యులు, స్నేహితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కరీనా కపూర్ సోషల్ మీడియాలో లేనప్పటికీ అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ వేడుకల్లో కరీనా సింపుల్ గా కుర్తా పైజామా ధరించారు. కరీనాకపూర్ బర్త్‌డే వేడుకలను సైఫ్ ప్రతి సంవత్సరం పటౌడీ ప్యాలెస్‌లోనే ఘనంగా నిర్వహిస్తున్నారు. ‘రెఫ్యూజీ’  సినిమాతో కరీనా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.2012లో సైఫ్‌ను రహస్య వివాహం చేసుకున్న కరీనా కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.  ప్రస్తుతం ఆమె ‘గుడ్ న్యూస్’, ‘అంగ్రేజీ మీడియం’ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు.

 

 

 

 

PREV
click me!

Recommended Stories

Sara Arjun: ధురంధర్ స్టార్ సారా అర్జున్ రూ.12 కోట్ల లగ్జరీ ఫ్లాట్.. వైరల్ ఫోటోలు
Top 10 Movies 2025: పవన్, వెంకటేష్, రాంచరణ్ లలో బాక్సాఫీస్ వద్ద ఎవరి సత్తా ఎంత ? 2025లో టాప్ 10 మూవీస్ ఇవే