'90 ఎంఎల్‌' టీజర్.. కార్తికేయ 'దేవదాస్' అవతారం!

By AN TeluguFirst Published Sep 21, 2019, 11:44 AM IST
Highlights

ఈ రోజు కార్తికేయ పుట్టిన రోజు సందర్భంగా '90ML' టీజర్‌ను రిలీజ్ చేశారు. పూటకో 90 తాగే కేర్‌లేస్‌ కుర్రాడి పాత్రలో కార్తికేయ కనిపించనున్నాడు. టీజర్‌ ద్వారా సినిమాలో కార్తికేయ పాత్ర ఎలా ఉండబోతుందో చెప్పారు. 

కార్తికేయ కథానాయకుడిగా చేసిన 'ఆర్ ఎక్స్ 100' యూత్ లో ఆయనకి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. అయితే ఆ తరువాత హీరోగాఆయన చేసిన సినిమాలేవీ అంతగా ఆడలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల నానీస్ గ్యాంగ్ లీడర్ సినిమాలోని విలన్ పాత్ర మాత్రం ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టింది.

తాజాగా కార్తికేయ హీరోగా మరో సినిమా చేస్తున్నాడు. అదే '90ml'. శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ఇటీవల విడుదల చేశారు. ఈ రోజు కార్తికేయ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు.పూటకో 90 తాగే కేర్‌లేస్‌ కుర్రాడి పాత్రలో కార్తికేయ కనిపించనున్నాడు. 

టీజర్‌ ద్వారా సినిమాలో కార్తికేయ పాత్ర ఎలా ఉండబోతుందో చెప్పారు. ఈ చిత్రంలో కార్తికేయ పాత్ర పేరు దేవదాస్‌. గోల్డ్‌ మెడలిస్ట్‌ అయిన దేవదాస్‌ ‘ఆథరైజ్డ్‌ డ్రింకర్‌’గా పాపులర్‌ కావడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటనే కాన్సెప్ట్ తో సినిమాను చిత్రీకరిస్తున్నారు.

ఈ సినిమాలో కార్తికేయ సరసన నేహా సోలంకి హీరోయిన్‌గా నటిస్తుండగా  రవి కిషన్‌, రావూ రమేష్‌, అలీ, పోసాని కృష్ణమురళి, అజయ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  అశోక్‌ రెడ్డి గుమ్మకొండ నిర్మాత. 

 

click me!