చిన్న కుమారుడు జెహ్ తో కరీనా కపూర్... వైరల్ గా ఇంస్టాగ్రామ్ ఫొటోస్

By team teluguFirst Published Aug 21, 2021, 2:08 PM IST
Highlights

 కరీనా చిన్న కుమారుడు జహంగీర్ అలీ ఖాన్ ని ఎత్తుకొని ఉన్న ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. బికినీ ధరించి ఉన్న కరీనా కపూర్, ఇంస్టాగ్రామ్ పోస్ట్ కి ఆసక్తికర కామెంట్ ఇచ్చారు. 

బాలీవుడ్ బెబో మాల్దీవ్స్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. భర్త సైఫ్ అలీ ఖాన్ బర్త్ డే వేడుకల కోసం రెండు రోజుల క్రితం మాల్దీవ్స్ కి వెళ్లిన కరీనా, అక్కడ తన వెకేషన్ కి సంబందించిన ఫోటోలు అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా కరీనా చిన్న కుమారుడు జహంగీర్ అలీ ఖాన్ ని ఎత్తుకొని ఉన్న ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. బికినీ ధరించి ఉన్న కరీనా కపూర్, ఇంస్టాగ్రామ్ పోస్ట్ కి ఆసక్తికర కామెంట్ ఇచ్చారు. ''ప్రేమ, సంతోషం, ధైర్యం ఎల్లప్పుడూ నీతో ఉండాలి'' అంటూ జహ్ కి ఆశీర్వాదాలు పంచింది కరీనా. అలాగే ఆరు నెలల నా జీవితం అంటూ... జెహ్ ని ఉద్దేశిస్తూ మరో కామెంట్ చేశారు. 


2021 ఫిబ్రవరి 15న కరీనా కపూర్ రెండవ సంతానంగా జెహ్ కి జన్మనిచ్చారు. జెహ్ ప్రస్తుతం ఆరు నెలల ప్రాయంలో ఉన్నారు. 2012లో సైఫ్ అలీ ఖాన్ ని కరీనా కపూర్ వివాహం చేసుకున్నారు. 2016లో వీరికి మొదటి సంతానంగా తైమూర్ అలీ ఖాన్ జన్మించారు. సైఫ్ కి ఇది రెండవ వివాహం అన్న సంగతి తెలిసిందే. మొదటి భార్య అమృతా సింగ్ తో సైఫ్ కి సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ జన్మించారు. 


 స్టార్ హీరోయిన్ గా అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించిన కరీనా... ఇప్పటికీ తన హవా కొనసాగిస్తున్నారు. క్రేజీ ప్రాజెక్ట్స్ దక్కించుకుంటూ సత్తా చాటుతున్నారు. అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న లాల్ సింగ్ చద్దా చిత్రంలో కరీనా హీరోయిన్ గా నటిస్తున్నారు. హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ కి రీమేక్ గా లాల్ సింగ్ చద్దా తెరకెక్కుతుండగా, భారీ అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య లాల్ సింగ్ చద్దా చిత్రంలో ఓ కీలక రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. 

click me!