Latest Videos

బర్దస్త్ వర్ష ఫోటో ఆ గ్రూప్ లో పెట్టిన హేమ .. ఆమె బాగోతం మొత్తం బయట పెట్టిన కరాటే కల్యాణి 

By Sambi ReddyFirst Published May 26, 2024, 7:49 PM IST
Highlights

జబర్దస్త్ కమెడియన్ వర్ష ఫోటోను గ్రూప్ లో పెట్టింది. ఏంటి ఈ ఫోటో ఎందుకు పెట్టింది అని అందరు అడుగుతున్నాం. వెంటనే డిలీట్ చేసింది. ఆ ఫోటో ఎందుకు పెట్టింది అని మాకు డౌట్ వచ్చింది. ఎవరికో పెట్టబోయి మీకు పెట్టేశానని ఎవరితోనో చెప్పిందట.

నటి హేమ బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అడ్డంగా బుక్కైంది. బెంగుళూరులోని ఒక ఫార్మ్ హౌస్ లో బర్త్ డే పార్టీ పేరుతో జరిగిన రేవ్ పార్టీ పై  పోలీసులు రైడ్ చేశారు.  చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు. నటి హేమ కూడా పార్టీకి హాజరైనట్లు పోలీసులు తెలిపారు. అయితే హేమ మాత్రం తాను రేవ్ పార్టీలో లేనని, హైదరాబాద్ లోని తన  ఫార్మ్ హౌస్ లో చిల్ అవుతున్నానంటూ  వీడియో రిలీజ్ చేసింది. ఆ తర్వాత ఇంట్లో బిర్యాని చేస్తున్నానంటూ మరో వీడియో పోస్ట్ చేసింది. 

తాను హైదరాబాద్ లోనే ఉన్నానంటూ జనాన్ని, పోలీసులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేసింది. కానీ చివరికి అడ్డంగా బుక్కైంది. ఆమె పార్టీకి పేరు మార్చుకుని వెళ్లిందని, ఆమె బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ తీసుకున్నట్లు తేలడంతో ఆమెకు నోటీసులు కూడా పంపించారు. దీంతో హేమ నాటకం అంతా బయటపడింది. అయితే తాజాగా కరాటే కళ్యాణి హేమ తప్పు చేసింది. ఆమెకు శిక్ష పడాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. 

అంతే కాదు హేమ రేవ్ పార్టీలకు వెళ్లడమే కాదు. అక్కడ కొంతమంది అమ్మాయిలని  సప్లై చేస్తుందని షాకింగ్ నిజాలు బయటపెట్టింది. తాజాగా కరాటే కళ్యాణి  మీడియాతో మాట్లాడుతూ .. హేమ చాలా మందిని మిస్ లీడ్ చేస్తుంటుంది. ఈ రేవ్ పార్టీ ఇష్యూ నే కాదు. గతంలో కూడా చాలా విషయాలు జరిగాయి. ఆమె దగ్గర కొంతమంది అమ్మాయిలు ఉంటారు. వాళ్ళ ఫోటోలను గ్రూప్ లలో షేర్ చేస్తూ ఉంటుంది. దానికి నేనే సాక్ష్యం. 

గతంలో ఒకసారి జబర్దస్త్ కమెడియన్ వర్ష ఫోటోను గ్రూప్ లో పెట్టింది. ఏంటి ఈ ఫోటో ఎందుకు పెట్టింది అని అందరు అడుగుతున్నాం. వెంటనే డిలీట్ చేసింది. ఆ ఫోటో ఎందుకు పెట్టింది అని మాకు డౌట్ వచ్చింది. ఎవరికో పెట్టబోయి మీకు పెట్టేశానని ఎవరితోనో చెప్పిందట. ఇలాంటి చాలా తప్పులు చేసింది. దొరికిపోతూనే ఉంటుంది. అసలు వర్ష ఫోటో ఆమె దగ్గర ఎందుకు ఉంది. ఎవరికి పంపాలి అనుకుందని చాలా అనుమానాలు వచ్చాయి. ఇప్పుడు హేమ ఈ డ్రగ్స్ కేసు నుండి తప్పించుకోలేదు అంటూ కరాటే కల్యాణి సంచలన వ్యాఖ్యలు చేసింది. 
 

click me!