Latest Videos

నటి మీనా రియల్ క్యారెక్టర్ ఇదా... నిజం బయటపెట్టిన నిర్మాత!

By Sambi ReddyFirst Published May 26, 2024, 7:36 PM IST
Highlights

నాలుగు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో ఉంది మీనా. ఆమె పై ఎలాంటి ఆరోపణలు లేవు. అయితే ఓ నిర్మాత మీనా, ఆమె తల్లి అవమానించారని చెప్పడం సంచలనం రేపుతోంది. 
 

చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిశ్రమలో అడుగుపెట్టింది మీనా. అనంతరం హీరోయిన్ గా మారింది. 90 లలో మీనా స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. అన్ని భాషల్లో ఆమె చిత్రాలు చేసింది. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో స్టార్ గా సత్తా చాటింది. మీనాకు క్లీన్ ఇమేజ్ ఉంది. ఆమెపై ఎలాంటి ఆరోపణలు లేవు. తాజాగా ఓ నిర్మాత ఆమెపై ఆరోపణలు చేశాడు. ఆయన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. 

తమిళ నిర్మాత మాణిక్యం నారాయణ్ మాట్లాడుతూ.. ఓ ఈవెంట్ చేయాలని నటి మీనాను కలిశాను. ఆమె నుండి ఎలాంటి స్పందన లేదు. మీనా తల్లి కూడా చాలా దురుసుగా ప్రవర్తించింది. నాలాంటి నిర్మాతలేగా మీతో చిత్రాలు చేసేది. అలాంటి నాతో అంత చీప్ మాట్లాడతారా అని బాధేసింది. ఆ అనుభవంతో ఇంకెప్పుడూ ఎవరినీ ఏమీ అడగకూడదని తెలిసొచ్చింది. రోజా, కుష్బూ, సుహాసిని నాతో సన్నిహితంగా ఉంటారు. నా కుమారుడి పెళ్ళికి కూడా వచ్చారని మాణిక్యం నారాయణ్ అన్నారు. 

సౌమ్యంగా కనిపించే మీనా మీద నిర్మాత చేసిన ఆరోపణలు వైరల్ గా మారాయి. కాగా మీనా 2009లో విద్యా సాగర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కుమార్తె. విజయ్ తేరి మూవీలో మీనా కూతురు చైల్డ్ ఆర్టిస్ట్ రోల్ చేసింది. 2022లో మీనా భర్త విద్యా సాగర్ అనారోగ్యంతో కన్నుమూశాడు. 
 

click me!