Latest Videos

దిల్ రాజు ఇప్పుడీ సినిమాని మధ్యలో ఆపేస్తాడా? కొనసాగిస్తారా

By Surya PrakashFirst Published May 26, 2024, 7:42 PM IST
Highlights

ఈ శనివారం ‘లవ్ మీ’ (Love Me) రిలీజైంది. ఈ సినిమాకు మార్నింగ్ షోకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. 

 


గత  కొన్నాళ్లుగా దిల్ రాజు బ్యానర్ నుండి వస్తున్న సినిమాలు వర్కవుట్ కావటం లేదు. ‘థాంక్యూ’ (Thank You) ‘వరిసు'(వారసుడు) (Varisu) ‘ది ఫ్యామిలీ స్టార్’ (Family Star) వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఇంపాక్ట్ చూపలేదు. ‘వారసుడు’ తమిళంలో ఓకే అనిపించినా తెలుగులో పెద్దగా ఆడలేదు. ఇప్పుడు తాజాగా ఈ శనివారం ‘లవ్ మీ’ (Love Me) రిలీజైంది. ఈ సినిమాకు మార్నింగ్ షోకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. 

అన్ని రివ్యూలులో చాలా నెగిటివ్ టాక్ వినిపిస్తుంది. ‘ఇలాంటి కథని దిల్ రాజు ఎలా యాక్సెప్ట్ చేశారు, పైగా ‘ఆర్య’ (Arya) వంటి క్లాసిక్ తో ఎలా పోల్చారు?’ అంటూ ఆయన జడ్జిమెంట్ పై కూడా చాలా మంది విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేఫధ్యంలో ఆయన బ్యానర్ లో రూపొందుతూ మధ్యలో ఆగిన  ‘సెల్ఫిష్’ (Selfish) సినిమా గురించి సందేహాలు మొదలయ్యాయి. 
 
వివరాల్లోకి వెళితే...దిల్ రాజు (Dil Raju) వారసుడు ఆశిష్ (Ashish Reddy) హీరోగా ‘రౌడీ బాయ్స్’ (Rowdy Boys) అనే సినిమా వచ్చింది. 2022 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్ అనిపించుకుంది. దాంతో రెండవ సినిమాగా ‘సెల్ఫిష్’ (Selfish) మొదలైంది. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ పై దిల్ రాజు, ‘సుక్కు రైటింగ్స్’ పై సుకుమార్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

సుకుమార్ (Sukumar)శిష్యుడు అయినటువంటి కాశి (Kasi Vishal) ఈ చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. హీరోయిన్ గా ‘లవ్ టుడే’ (Love Today) బ్యూటీ ఇవేనా (Ivana)ఎంపికైంది. దాదాపు యాభై శాతం పైనే షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది ఈ మూవీ. అయితే దాన్ని ప్రక్కన పెట్టి  ఊహించని విధంగా ఆశిష్ ‘లవ్ మీ’ సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. దీంతో ‘సెల్ఫిష్’ ఆగిపోయింది అనే టాక్ మొదలైంది.

కానీ రీసెంట్ గా  హీరో ఆశిష్ మాత్రం ‘సెల్ఫిష్’ ఆగిపోలేదు అని చెప్పాడు. అతను మాట్లాడుతూ.. ” ‘సెల్ఫిష్’ మూవీ షూటింగ్ కొంత పార్ట్ కంప్లీట్ అయ్యింది. కాకపోతే సునీల్ వంటి కొంతమంది సీనియర్ ఆర్టిస్ట్..ల కాల్షీట్లు అందుబాటులో లేకపోవడం, కొంత పోర్షన్ నచ్చక రీ షూట్ చేయాల్సి ఉండటంతో డిలే అయ్యింది. ఈలోగా ‘లవ్ మీ’ చేసే ఛాన్స్ నాకు వచ్చింది. 

54 రోజుల్లో ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయిపోతుంది అంటే.. దీని పై వర్క్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది కంప్లీట్ అయ్యింది కాబట్టి.. ‘సెల్ఫిష్’ ప్రాజెక్టు పై మళ్ళీ దృష్టి పెడతాం” అంటూ చెప్పుకొచ్చాడు ఆశిష్. అయితే ఇప్పుడు లవ్ మీ సినిమా టాక్ తేడా కావటంతో ‘ ‘సెల్ఫిష్’ ప్రాజెక్టు ఉంటుందా?’  దాన్ని ప్రక్కన పెట్టేసి వేరే సినిమా మొదలెడతారా అనే డిస్కషన్స్ మొదలయ్యాయి. ఈ విషయమై  త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
 

click me!