షమితా శెట్టిని ఆంటీ అని పిలిచిన నటుడు.. దారుణంగా ట్రోలింగ్

pratap reddy   | Asianet News
Published : Oct 06, 2021, 06:09 PM IST
షమితా శెట్టిని ఆంటీ అని పిలిచిన నటుడు.. దారుణంగా ట్రోలింగ్

సారాంశం

హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 15 ప్రారంభమైంది. శిల్పా శెట్టి సోదరి షమితా శెట్టి ఈ షోలో కంటెస్టెంట్ గా పాల్గొంటుండడం ఆసక్తిగా మారింది. మరికొందరు బుల్లితెర నటులు, గాయకులు కంటెస్టెంట్స్ గా పాల్గొంటున్నారు.

హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 15 ప్రారంభమైంది. శిల్పా శెట్టి సోదరి షమితా శెట్టి ఈ షోలో కంటెస్టెంట్ గా పాల్గొంటుండడం ఆసక్తిగా మారింది. మరికొందరు బుల్లితెర నటులు, గాయకులు కంటెస్టెంట్స్ గా పాల్గొంటున్నారు. మంగళ వారం జరిగిన ఎపిసోడ్ సోషల్ మీడియాలో అభిమానుల మధ్య చర్చకు కారణం అయింది. 

బుల్లితెర నటుడు కరణ్ కుంద్రా..షమితా శెట్టిని ఆంటీ అని పిలిచాడు. ఆమె వయసుని ఎత్తిచూపేలా కరణ్ కుంద్రా ఈ వ్యాఖ్యలు చేశాడు. దీనితో నెటిజన్లు కరణ్ ని దుమ్మెత్తి పోస్తూ ట్రోల్ చేస్తున్నారు. Shamita shetty వయసు 42 ఏళ్ళు. కరణ్ కుంద్రా వయసు 36  ఏళ్ళు. మీ ఇద్దరి మధ్య వయసులో ఏం పెద్ద వ్యత్యాసం ఉందని షమితాని ఆంటీ అని పిలిచావ్ అంటూ నెటిజన్లు నిలదీతున్నారు. 

ఏజ్ షేమింగ్ వ్యాఖ్యలు సరికాదు. ఒకరి గురించి మాట్లాడేముందు నీ గురించి నువ్వు తెలుసుకో అంటూ కరణ్ కు చురకలంటిస్తున్నారు. షమితాని ఆంటీ అని పిలుస్తున్న నువ్వు.. నీ మాజీ ప్రేయసి అనూష దండేకర్ గురించి తెలుసుకో. ఆమె నీకన్నా వయసులో పెద్ద. ఆమెని ఎలా ప్రేమించావు. ప్రస్తుతం అనూష వయసు ఆల్మోస్ట్ 40. ఆమెతో కలసి తిరిగే రోజుల్లో ఆమెని కూడా ఆంటీ అని పిలిచావా అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. 

కరణ్ వ్యాఖ్యలపై షమితా తల్లి సునంద స్పందించారు. ఏజ్ షేమింగ్ వ్యాఖ్యలు ఏమాత్రం సరికాదు. సల్మాన్ ఖాన్.. కరణ్ పై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. మరికొందరు నెటిజన్లయితే షమితాని ఆంటీ అని పిలిచిన కరణ్.. ఐదు పదుల వయసు దాటిన సల్మాన్ ఖాన్ ని ఏమని పిలుస్తాడో అంటూ ట్రోల్ చేస్తున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు