`గని` ఫస్ట్ గ్లింప్స్ః వరుణ్‌ తేజ్‌ బ్లాక్‌ బస్టర్‌ పంచ్‌..

Published : Oct 06, 2021, 05:44 PM IST
`గని` ఫస్ట్ గ్లింప్స్ః వరుణ్‌ తేజ్‌ బ్లాక్‌ బస్టర్‌ పంచ్‌..

సారాంశం

`గని` సినిమా ఫస్ట్ గ్లింప్స్ ని `గని ఫస్ట్ పంచ్‌ గ్లింప్స్` పేరుతో దీన్ని విడుదల చేయగా, ఇది ఆద్యంతం ఆకట్టుకుంటుంది. బాక్సింగ్‌ రింగ్‌లో ప్రత్యర్థులతో బాక్సింగ్‌కి బరిలోకి దిగిన వరుణ్‌ బ్యాక్ తిరిగి ఇచ్చిన పంచ్‌ అదిరిపోయేలా ఉంది.

వరుణ్‌ తేజ్‌ నటిస్తున్న తాజా చిత్రం `గని`. బాక్సింగ్‌ నేపథ్యంలో సాగే చిత్రమిది. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. సాయిమంజ్రేకర్‌, ఉపేంద్ర, సునిల్‌శెట్టి, నవీన్‌ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అల్లు బాబీ కంపెనీ పతాకంపై అల్లు బాబీ, సిద్దు ముద్ద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. 

ghani సినిమా ఫస్ట్ గ్లింప్స్ ని `glimpse of ghani first punch` పేరుతో దీన్ని విడుదల చేయగా, ఇది ఆద్యంతం ఆకట్టుకుంటుంది. బాక్సింగ్‌ రింగ్‌లో ప్రత్యర్థులతో బాక్సింగ్‌కి బరిలోకి దిగిన varun tej బ్యాక్ తిరిగి ఇచ్చిన పంచ్‌ అదిరిపోయేలా ఉంది. ఇది కచ్చితంగా సినిమా బ్లాక్‌బస్టర్‌ పంచ్‌ అంటున్నారు అభిమానులు. ప్రస్తుతం ఈ గ్లింప్స్ యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది. ఇందులో బాక్సర్‌గా వరుణ్‌ తేజ్‌ కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. ఎస్‌ఎస్‌ థమన్‌ బీజీఎం ఆకట్టుకుంటుంది. అదే సమయంలో `భీమ్లా నాయక్‌` బీజీఎంని తలపిస్తుంది. 

స్పోర్ట్స్ నేపథ్యంలో సినిమాలు అడపాదడపా వస్తుంటాయి. బాక్సింగ్‌ నేపథ్యంలో చాలా అరుదు. ప్రస్తుతం వరుణ్‌ తేజ్‌ నటిస్తున్న ఈ చిత్రంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 3న విడుదల చేయబోతున్నట్టు ఇందులో యూనిట్‌ ప్రకటించింది. వరుణ్‌ తేజ్‌ చివరగా `గద్దల కొండ గణేష్‌` చిత్రంలో నటించారు. హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఆ సినిమా ఫర్వాలేదనిపించుకుంది. ఆ తర్వాత రెండేళ్ల గ్యాప్‌తో `గని` చిత్రంతో రాబోతున్నారు వరుణ్‌ తేజ్‌.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు