ప్రకాశ్‌రాజ్‌ను ఓడించండి, తెలంగాణ బిడ్డలను గెలిపించండి: ‘‘ మా ’’ ఎన్నికలపై సీవీఎల్ కీలక వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Oct 6, 2021, 4:54 PM IST
Highlights

‘‘ మా ’’ ఎన్నికల్లో తెలంగాణ బిడ్డలను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహారావు. ప్రకాశ్ రాజ్‌‌కు దేశమన్నా, ధర్మమన్నా, దేవుడన్నా చులకన భావమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. చులకన భావం వున్న ప్రకాశ్ రాజ్‌ను ఎన్నికల్లో ఓడించాలని సీవీఎల్ పిలుపునిచ్చారు. 
 

మా ఎన్నికల్లో మరోసారి ప్రాంతీయవాదానికి తెర లేచింది. ఉదయం నటుడు, దర్శకుడు రవిబాబు మాట్లాడుతూ.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో తెలుగువారినే గెలిపించాలని పిలుపునిచ్చారు. ఆ కాసేపటికే సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహారావు (cvl narasimharao) సైతం స్పందించారు. ‘‘ మా ’’ ఎన్నికల్లో తెలంగాణ బిడ్డలను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రకాశ్ రాజ్‌‌కు దేశమన్నా, ధర్మమన్నా, దేవుడన్నా చులకన భావమని సీవీఎల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చులకన భావం వున్న ప్రకాశ్ రాజ్‌ను ఎన్నికల్లో ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రకాశ్ రాజ్ మా ఎన్నికల్లో పోటీ చేయకుండా వుంటే బాగుండేదని సీవీఎల్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల నుంచి ప్రకాశ్ రాజ్ తప్పుకుంటారని ఆశిస్తున్నానని నరసింహారావు వ్యాఖ్యానించారు. 

అంతకుముందు రవిబాబు (ravi babu) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ముఖ్యంగా మనవాడు, తెలుగువాడికే ఓటు వేయాలని కుండబద్దలు కొట్టారు. నేను లోకల్ నాన్ లోకల్ కార్ట్ ఉపయోగించడం లేదు అంటూనే, Prakash raj పై ఆయన సంచలన కామెంట్స్ చేశారు. ప్రకాష్ రాజ్ గౌరవంగా సినిమాలు చేసుకోకుండా, ఎన్నికలలో నిలబడం ఎందుకు అన్నారు. పోటీలో నిలబడడం ద్వారా ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అని ఎందుకు అనిపించుకోవాలి, నేనే ప్రకాష్ రాజ్ అయితే ఎన్నికలలో పోటీ చేయను అన్నారు రవిబాబు.

Also Read:తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కి తెలుగువాడే అధ్యక్షుడు కావాలి... నటుడు రవిబాబు కీలక వ్యాఖ్యలు

MAA elections లో తెలుగువారినే ఎందుకు ఎన్నుకోవాలో ఆయన కొన్ని కారణాలు చెప్పారు. తెలుగువాడిని ఎన్నుకోవడం మనకు కంఫర్ట్ గా ఉంటుంది అన్నారు. తెలుగు పరిశ్రమలో మొదట తెలుగువాళ్ళకే అవకాశాలు ఇవ్వాలని రవిబాబు గట్టిగా డిమాండ్ చేశారు. ఎక్కువ డబ్బులు ఇచ్చి ఎందుకు బయట నటులను తీసుకోవాలి, మనవాళ్లకు ఎందుకు అవకాశం ఇవ్వరు. మన వాళ్లకు టాలెంట్ లేదా? మనవాళ్లను మనం ఎంకరేజ్ చేసుకోకపోతే, బయట వాళ్ళు ఎలా చేస్తారు అన్నారు. తాను తెరకెక్కించిన సినిమాల్లో అనేక మంది తెలుగు నటులకు అవకాశాలు ఇచ్చానని రవిబాబు ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కి (movie artists association) తెలుగువాడే అధ్యక్షుడిగా ఉండాలి, అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 

click me!