మరో సంచలనానికి రెడీ అవుతున్న కరణ్ జొహార్.. బాలీవుడ్ రహస్యాలన్నీ విప్పి చెపుతాడంట..?

Published : Sep 10, 2022, 01:53 PM IST
మరో సంచలనానికి రెడీ అవుతున్న కరణ్ జొహార్.. బాలీవుడ్ రహస్యాలన్నీ విప్పి చెపుతాడంట..?

సారాంశం

బాలీవుడ్ లో మరో బాంబ్ పేల్చబోతున్నారు స్టార్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కరణ్ జోహార్. ఇప్పటికే సంచలనాలు సృష్టిస్తున్న ఈ స్టార్.. త్వరలో బాలీవుడ్ సీక్రేట్స్ ను బయట పెడతానంటున్నాడు. ఇంతకీ కరణ్ ఏం చేయబోతున్నాడు....? 

బాలీవుడ్ లో మరో బాంబ్ పేల్చబోతున్నారు స్టార్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కరణ్ జోహార్. ఇప్పటికే సంచలనాలు సృష్టిస్తున్న ఈ స్టార్.. త్వరలో బాలీవుడ్ సీక్రేట్స్ ను బయట పెడతానంటున్నాడు. ఇంతకీ కరణ్ ఏం చేయబోతున్నాడు....? 

బాలీవుడ్ సెన్సేషనల్ స్టార్స్ లో కరణ్ జోహార్ కూడా ఒకకరు. కాఫీ విత్ కరణ్ షో తో ఆయన ఇంకా పాపులర్ అయ్యాడు. ఆ షోలో అందరి రహస్యాలు బయట పెట్టడానికి ముఖ్యంగా స్టార్స్ సెక్స్ లైఫ్ ను టార్గెట్ చేస్తూ.. బోల్డ్ క్వశ్చన్స్ తో.. వారికి ముచ్చెమటలు పట్టిస్తుంటారు. ఇక ఇప్పుడు ఇదే క్రమంలో మరో సంచలనానికి ఆయన రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.  

బాలీవుడ్ రహస్యాలను బయట పెడతానంటున్నాడు కరణ్ జోహార్. అది కూడా  ఓ వెబ్ సిరీస్ తో మొత్తం బాహ్య ప్రపంచానికి తెలిసేలా చేస్తాను అంటున్నాడు. కొత్తగా ఓ వెబ్ సిరీస్ ను చేయనున్నట్టు ఆయన  ప్రకటించారు. ఈ నూతన వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం అవుతుందని అన్నారు. . గ్లోబల్ డిస్నీ ఫ్యాన్ ఈవెంట్ లో భాగంగా కరణ్ ఈ విషయాన్ని ప్రకటించాడు. 

హాట్ స్టార్ లో స్టార్ట్ కాబోతున్న ఈ కొత్త షోలో ఎంటర్టైన్మెంట్ లోనే బిగ్ బిజినెస్ డీల్స్ కు సబంధించిన  అనేక రహస్యాలను మీ ముందుకు తీసుకొస్తానని కరణ్ జొహార్ అనౌన్స్ మెంట్ ఇచ్చాడు. ఇప్పటికే కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ 7 సీజన్ తో సంచనాలు సృష్టిస్తున్నాడు. స్టార్ వరల్డ్ లో ప్లే అవుతున్న ఈ షో ద్వారా నటీ నటుల వ్యక్తిగత జీవిత రహస్యాలను తవ్వితీస్తున్నాడు.  అయితే ఇక్కడ మరో విశేషం ఏంటీ అంటే..? కాఫీ విత్ కరణ్ షో నెక్ట్స్ సీజన్ పై కూడా ప్రకటన వచ్చింది. 

ఇక నెక్ట్స్ జరగబోయే కాఫీ విత్ కరణ్ 8వ సీజన్  పూర్తిగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో ప్రసారం అవుతుందని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రకటన చేసింది. అసలే కరణ్ ఏం అడుగుతాడన్న భయంతో.. చాలామంది స్టార్లు ఆవైపు చూడటం లేదు. ఇక బాలీవుడ్ రహస్యాలు బయట పెడతానంటూ.. కరణ్ జోహార్ పరకటన చేయడంతో.. ఆ వెబ్ సీరీస్ ద్వారా.. ఆయన ఏం చేయాలనుకుంటున్నాడబ్బా అని అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rajinikanth Retirement .. 3 సినిమాల తర్వాత సూపర్ స్టార్ రిటైర్మెంట్ ప్రకటించనున్నారా?
Bigg Boss Telugu 9: లేటెస్ట్ ఓటింగ్‌లో ఊహించని ట్విస్ట్.. డేంజర్‌ జోన్‌లోకి టాప్‌ కంటెస్టెంట్లు