'కాంతార' తెలుగు వెర్షన్ కలెక్షన్స్...అల్లు అరవింద్ కే మైండ్ బ్లాస్ట్

Published : Oct 16, 2022, 04:43 PM IST
 'కాంతార' తెలుగు వెర్షన్ కలెక్షన్స్...అల్లు అరవింద్ కే మైండ్ బ్లాస్ట్

సారాంశం

 గతంలో భూమి కోసం ... భుక్తి కోసం అనే వాస్తవ సంఘటనల ఆధారంగా చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఇక్కడ ఆ రెండింటితో పాటు దైవశక్తితో ముడిపడిన ఒక విశ్వాసం కూడా కథలో భాగం కావడం వలన కొత్తదనాన్ని తీసుకొచ్చినట్టు అయింది. 


రిషబ్ శెట్టి హీరో గా రూపొందిన కన్నడ చిత్రమే 'కాంతార'. మిస్టీరియస్ ఫారెస్టు అనేది ఈ కన్నడ పదానికి అర్థం. రిషబ్ శెట్టి రాసిన కథ ఇది .. ఆయన దర్శకత్వం వహించిన సినిమా ఇది. క్రితం నెల 30వ తేదీన కన్నడలో విడుదలైన ఈ సినిమా అక్కడ సంచలన విజయాన్ని నమోదు చేసింది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా తెలుగు వెర్షన్ ను గీతా ఆర్ట్స్ వారు ఈ శనివారమే విడుదల చేశారు. సప్తమి గౌడ హీరోయిన్ గా అలరించిన ఈ సినిమాలో, కిశోర్ .. అచ్యుత్ కుమార్ .. ప్రమోద్ కుమార్ ... మనసి సుధీర్ ముఖ్యమైన పాత్రలను పోషించారు.  తెలుగులో ఈ సినిమాను గీతా ఆర్ట్స్ వారు రిలీజ్ చేసారు. తెలుగు రాష్ట్రాలలో శనివారం అంటే నిన్న ఈ సినిమా విడుదలైంది.  అలాగే హిందీలో శుక్రవారం ఈ సినిమా రిలీజైంది.

హిందీలో ఈ చిత్రం రెండు రోజులకు కానూ నెట్ 4.02 కోట్లు వచ్చింది. తెలుగు వెర్షన్ ఒక్కరోజులో నాలుగు కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఓ కన్నడ చిత్రం ..అదీ పెద్దగా పరిచయం లేని హీరో చిత్రానికి ఈ రేంజి కలెక్షన్స్ రావటం అందరికి షాక్ ఇస్తోంది.ఈ రోజు కూడా అన్ని చోట్లా హౌస్ ఫుల్ అయ్యినట్లు తెలుస్తోంది. ఈ రోజు దాదాపు 5 కోట్లు దాకా వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.ఈ స్దాయి కలెక్షన్స్ తాను ఊహించలేదని, అల్లు అరవింద్ అన్నారట. ఎంతో అనుభవం ఉన్న నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా ఆశ్చర్యపోయే రీతిలో ఓపినింగ్స్, కలెక్షన్స్ వస్తున్నాయంటే అసలు ఏ స్దాయిలో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలంటున్నారు.

ఈ సినిమా ఫారెస్టు నేపథ్యంలో నడిచే కథ. అడవిలోనే పుడుతుంది .. అడవి చుట్టూనే తిరుగుతుంది. అయితే అడవితో పాటు అక్కడి గిరిజనుల జీవితాలను .. వాళ్ల నమ్మకాలను .. ఆచార వ్యవహారాలను ప్రతిబింబిస్తూ ఈ కథ నడుస్తుంది. గతంలో భూమి కోసం ... భుక్తి కోసం అనే వాస్తవ సంఘటనల ఆధారంగా చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఇక్కడ ఆ రెండింటితో పాటు దైవశక్తితో ముడిపడిన ఒక విశ్వాసం కూడా కథలో భాగం కావడం వలన కొత్తదనాన్ని తీసుకొచ్చినట్టు అయింది. ఆ కొత్తదనమే ప్రేక్షకులను చివరివరకూ కదలకుండా కూర్చోబెడుతుంది.  

రిషబ్ శెట్టి మాట్లాడుతూ .. కన్నడలో  'కాంతార' అంటే మిస్టీరియస్ ఫారెస్టు అని అర్థం. ప్రకృతికి .. మానవుడికి మధ్య జరిగే ఘర్షణ ఇది. తమిళనాడులో జల్లికట్టు మాదిరిగానే, కర్ణాటకలో 'కంబళ' అనే క్రీడ ఉంది. కథలో ఆ నేపథ్యం కూడా ప్రధానంగానే కనిపిస్తుంది. ఈ సినిమాకి నేను హీరోను మాత్రమే కాదు, రైటర్ ను .. డైరెక్టర్ ను అయినప్పటికీ ఎక్కువ టెన్షన్ అనిపించలేదు" అన్నారు.  

కథకి ఎక్కడ ఏం కావాలో అది ఇస్తూ వెళ్లాను. అలాగే నా సినిమాల నుంచి ఆడియన్స్ ఏం ఆశిస్తారో ఆ అంశాలు తగ్గకుండా చూసుకుంటూ వెళ్లాను. అందువలన నాకు పెద్దగా కష్టంగా అనిపించలేదు. ఈ సినిమా చివరి అరగంట సేపును ప్రేక్షకులు కుర్చీలో నుంచి కదలకుండా చూస్తారు. అజనీశ్ లోకనాథ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది" అంటూ చెప్పుకొచ్చాడు. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా