తెలుగులో సినిమా చేయబోతున్న ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టి.. అల్లు అరవింద్ క్లారిటీ.!

Published : Oct 19, 2022, 06:35 PM IST
తెలుగులో సినిమా చేయబోతున్న ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టి.. అల్లు అరవింద్ క్లారిటీ.!

సారాంశం

కన్నడ హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty) తాజాగా ‘కాంతార’తో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నారు. త్వరలో డైరెక్ట్ గా తెలుగులో సినిమా చేయబోతున్నాడు. దీనిపై నిర్మాత అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు.   

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఎలాంటి చిత్రం వచ్చిన  బ్లాక్ బాస్టర్ గా నిలుస్తున్న విషయం తెలిసిందే. ‘కేజీఎఫ్’,‘విక్రాంత్ రోణా’,‘777ఛార్లీ’ వంటి సినిమాలు కన్నడ ప్రేక్షకులతో పాటు దేశ వ్యాప్తంగా ఆడియెన్స్ ను అలరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty) నటించిన ‘కాంతార’(Kantara) చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా తెలుగులో మంచి కలెక్షన్స్ ను రాబడుతోంది. ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ ను కలెక్ట్ చేసింది. సెప్టెంబర్ 30న కన్నడలో రిలీజై బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. 

దీంతో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) ఈ చిత్రాన్ని తెలుగులో డబ్ చేసి అక్టోబర్ 15న గ్రాండ్ గా రిలీజ్ చేశారు. దీంతో తెలుగు ప్రేక్షకులతోనూ ఈ సినిమా హౌరా అనిపించింది. ముఖ్యంగా రిషబ్ శెట్టి నటనకు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. ‘కాంతార’తో తెలుగు ఇండస్ట్రీలోనూ రిషబ్ కు మార్కెట్ ఏర్పడిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో తర్వలోనే రిషబ్ డైరెక్ట్  తెలుగు ఫిల్మ్ లో నటించబోతున్నారని తెలుస్తోంది. దీనిపై తాజాగా నిర్మాత అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు. 

‘కాంతార’ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న తరుణంలో తాజాగా అల్లు అరవింద్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ..  సినిమాకు ఎమోషన్ బారియర్ తప్ప భాషాతో పనిలేదన్నారు. రిషబ్ శెట్టి నటన అందరికీ నచ్చేస్తుందని తెలిపారు. మొదట బన్నీవాసు ఈ చిత్రాన్ని తన వద్దకు తేగానే.. ఎమెషనల్ గా కనెక్ట్ అయినట్టు తెలిపారు. అనుకున్నట్టుగా తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేయగా మంచి రిజల్ట్ వచ్చిందన్నారు. రిషబ్ కూడా తెలుగు ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అయ్యారన్నారు. ఇప్పటికే రిషబ్ శెట్టిని ‘గీతా ఆర్ట్స్’ బ్యానర్ లో సినిమా చేయమని అడిగామన్నారు. ఇందుకు రిషబ్ కూడా ఒకే చెప్పారని తెలిపారు. దీంతో త్వరలోనే తెలుగులో సినిమా చేయబోతున్నట్టు అర్థమవుతోంది. 

రిషబ్ శెట్టి కన్నడలో ‘బెల్ బాటమ్’తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పటి నుంచి ఇండస్ట్రీలో వచ్చిన అవకాశాలను అందుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ‘కాంతార’ సక్సెస్ తో ఆయన  క్రేజ్ మరింతగా పెరిగింది. ప్రస్తుతం ‘బెల్ బాటమ్ 2’,‘మహనీయరే మహిలేయరే’, ‘అంటగోని శెట్టి’,‘బ్యాచిలర్ పార్టీ’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇవన్నీ షూటింగ్ దశలోనే ఉన్నాయి.  వీటి తర్వాతనే ‘గీతా ఆర్ట్స్’లో సినిమా చేసే అవకాశం ఉంది. కాంతార చిత్రానికి రిషబ్ శెట్టి  రచన, దర్శకత్వం వహిస్తూ నటించారు. సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది. హోంబాలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మించారు. 

PREV
click me!

Recommended Stories

Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?
Manchu Manoj: రామ్‌ చరణ్‌, శింబులను దించుతున్న మంచు మనోజ్‌.. అదిరిపోయేలా `డేవిడ్‌ రెడ్డి` గ్లింప్స్