
దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన కన్నడ సినిమా `కాంతార`. దీని రెండో భాగం `కాంతార చాప్టర్ 1` ఇప్పుడు భారీగా విడుదలవుతోంది. ఇటీవల రిలీజైన `కాంతార చాప్టర్ 1` ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. 24 గంటల్లోనే ఇది ఏకంగా 107 మిలియన్స్ వ్యూస్‌ని రాబట్టి అన్ని రికార్డులను బ్రేక్ చేసింది. దీంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. `కాంతార` రెండో భాగంలో కూడా కళ్లు చెదిరే విజువల్స్ ఉంటాయని ఈ ట్రైలర్ స్పష్టం చేస్తోంది.
ఈ క్రమంలో ఈ సినిమాకి సంబంధించిన అదిరిపోయే అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమా దేశవ్యాప్తంగా 7,000 స్క్రీన్లలో రిలీజ్ అవుతుందని కొత్త సమాచారం. రాబోయే అన్ని అప్‌డేట్‌లను హోంబలే ఫిలింస్ పేజీలో చూడొచ్చు. ఈ సినిమా రెండో భాగం అక్టోబర్ 2న కన్నడ, హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, ఇంగ్లీష్ తోపాటు స్పానిష్ భాషలోనూ రిలీజ్ చేస్తున్నారట. ఇలా భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుందని నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ ముందే ప్రకటించింది.
చాలా తక్కువ బడ్జెట్‌లో రిలీజై భారీ విజయం సాధించిన `కాంతార` మొదటి భాగం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తర్వాత ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, ఇంగ్లీష్, తుళు వెర్షన్లు కూడా రిలీజై, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టాయి. అందుకే, సినిమా అభిమానులు `కాంతార`(కాంతార 2) రెండో భాగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
రిషబ్ శెట్టి కథ రాసి దర్శకత్వం వహిస్తున్న `కాంతార చాప్టర్ 1`ను విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటించింది. మూడేళ్ల షూటింగ్ తర్వాత ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఇంతకుముందు రిలీజ్ చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్, టీజర్ ట్రెండింగ్‌లో ఉండి, అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇప్పుడు ట్రైలర్ దేశ వ్యాప్తంగా ట్రెండ్ అవుతుంది. కల్పన, పురాణం కలిసిన ఒక అద్భుతమైన విజువల్ అనుభవాన్ని ఇచ్చిన కాంతార, బ్లాక్‌బస్టర్ జాబితాలో చేరింది. దాని రెండో భాగం మళ్లీ చరిత్ర సృష్టించడానికి ఇంకొన్ని రోజులే ఉన్నాయి.
మూడేళ్ల క్రితం విడుదలైన `కాంతార` చిత్రంలో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. ఆయన ద్విపాత్రాభినయం చేశారు. ఇందులో ఆయనకు జోడీగా సప్తమి గౌడ నటించింది. కిశోర్, అచ్యుత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. కర్నాటకలోకి తీర ప్రాంతంలోని జానపద కథలను బేస్ట్ చేసుకుని భూత కోల అనే సంస్కృతిక కళని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆథ్యాత్మికతకు, ఒక భూస్వామి కుట్రలకు ముడిపెడుతూ రూపొందించిన ఈ చిత్రం విశేషంగా ఆదరణ పొందింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ.400కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. కేవలం రూ.14 కోట్లు తెరకెక్కి ఈ స్థాయిలో వసూళ్లు చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. దీంతో `కాంతార 2`ని భారీ బడ్జెట్‌తో, భారీ స్కేల్‌లో రూపొందించారు రిషబ్ శెట్టి. మరి మొదటి సినిమా రేంజ్‌లో ఇది ఆకట్టుకుంటుందా అనేది చూడాలి.