ప్రభాస్ ఫ్యాన్ సూసైడ్ నోట్... 'నా చావుకు రాధే శ్యామ్ డైరెక్టర్ కారణం'

Published : Nov 12, 2021, 08:19 AM IST
ప్రభాస్ ఫ్యాన్ సూసైడ్ నోట్... 'నా చావుకు రాధే శ్యామ్ డైరెక్టర్ కారణం'

సారాంశం

ప్రభాస్ ఫ్యాన్స్ అసహనం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. రాధే శ్యామ్ మూవీ అప్డేట్స్ విషయంలో విసిగిపోయిన ఓ వీరాభిమాని, సూసైడ్ కి సిద్దమయ్యాడు. అతడు సూసైడ్ నోట్ రాయగా, వైరల్ గా మారింది.   

ప్రభాస్ (Prabhas) నుండి రెండేళ్లకు కూడా ఓ మూవీ రావడం లేదు. పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ అన్నీ భారీ చిత్రాలు చేస్తున్న నేపథ్యంలో, చిత్రీకరణ ఆలస్యం అవుతుంది. కాగా ప్రభాస్-పూజా హెగ్డే కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాధే శ్యామ్ చిత్రీకరణ మొదలై దాదాపు మూడేళ్లు అవుతుంది. అనేక కారణాలతో ఈ మూవీ చిత్రీకరణ ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు 2022 సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. 


విడుదలకు కేవలం రెండు నెలల సమయం మాత్రమే వుంది. అయినప్పటికీ మూవీ నుండి అనుకున్న స్థాయిలో అప్డేట్స్ రావడం లేదు. చాలా కాలంగా ఈ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ అసహనంతో ఉన్నారు.Radhe shyam నిర్మాతలుగా ఉన్న యూవీ క్రియేషన్స్ పై వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ హోమ్ బ్యానర్ అయిన యూవీ క్రియేషన్స్ పై పలుమార్లు ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా ట్రోలింగ్ కి దిగారు. 


తాజాగా ఓ డై హార్డ్ ఫ్యాన్ వినూత్నంగా నిరసన తెలిపారు. యూవీ క్రియేషన్స్ తీరుతో విసిగిపోయి... ఆత్మ హత్యకు పాల్పడుతున్నట్లు లేఖ రాశాడు. తన చావుకు యూవీ క్రియేషన్స్, రాధే శ్యామ్ డైరెక్టర్ రాధా కృష్ణ కారణం ని లేఖలో పేర్కొన్నాడు. రాధే శ్యామ్ అప్డేట్స్ కోసం చాలా కాలంగా ఎదురు చూశాం. ఇంకా అప్డేట్స్ వస్తాయి అనుకుంటే, అది జరగడం లేదు. కనీసం నా చావుతో అయినా మీలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాను. అంటూ సూసైడ్ నోట్ లో తన మనోభావాలు వెల్లడించారు.

 Also read Prabhas: ఆదిపురుష్ షూటింగ్ అప్డేట్... గుమ్మడికాయ కొట్టిన ప్రభాస్!
ఈ లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు రాధే శ్యామ్ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. చిత్ర యూనిట్.. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నారట. ఇక రాధే శ్యామ్ పీరియాడిక్ లవ్ డ్రామాగా తెరకెక్కుతుంది. ఇటీవల విడుదలైన టీజర్ ద్వారా ప్రభాస్ సరికొత్త రోల్ ట్రై చేసినట్లు అర్థం అవుతుంది. 

Also read Pushpaka vimanam movie review:పుష్పక విమానం ప్రీమియర్ రివ్యూ... సుందరం భార్య లేచిపోయింది, జనాల ఫీలింగ్ ఏంటంటే!

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Raasi: `నిజం` విషయంలో రియలైజ్‌ అయిన రాశి, ఆడియెన్స్ కి సారీ.. పాపం ప్రతాప్‌ మూవీపై షాకింగ్‌ కామెంట్‌
Karthika Deepam 2 Today Episode: సుమిత్రకు షాకిచ్చిన దశరథ- జైలు నుంచి బయటకు వచ్చిన వైరా-జ్యో డౌట్