
కన్నడ స్టార్ హీరో యంగ్ తరంగ్ యశ్ హీరోగా. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కెజియఫ్2. హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ జోరు పెంచింది మూవీ యూనిట్. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ కూడా రీలీజ్ చేశారు.
అయితే ఒక్కరోజులోనే ఈ ట్రైలర్ అన్ని భాషల్లో రికార్డుల మోత మోగిస్తుంది. రిలీజ్ అయిన 24గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి 109 మిలియన్ వ్యూస్‌ను సాధించింది. ట్రైలర్ కి కన్నడ భాషలో 18మిలియన్ వ్యూస్, తెలుగులో 20మిలియన్ ,హిందీలో 51మిలియన్, తమిళంలో 12 మిలియన్ , మలయాళంలో 8మిలియన్ వ్యూస్ వచ్చాయి కెజియఫ్2 ట్రైలర్ కు.
ఇక ఈమూవీ ట్రైలర్ క్రియేట్ చేసిన రికార్డ్స్ ను గురించి చెపుతూ.. ఈమూవీ మేకర్స్ అయిన హోంబెలే ఫిల్మ్స్....రికార్డ్స్.. రికార్డ్స్.. రికార్డ్స్.. రాఖీకి ఇది ఇష్టం ఉండదు, అందుకు తప్పించుకుంటాడు. కానీ రికార్డ్స్ రాఖీని ఇష్టపడతాయి. అందుకే వాటి నుంచి తప్పించుకోలేడు అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు.
కెజిఎఫ్ ఈ దశాబ్దంలో తెరకెక్కిన బెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు. 2018లో విడుదలైన కెజిఎఫ్ మూవీ పర్ఫెక్ట్ పాన్ ఇండియా మూవీ. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసింది. అంతకు మించి యాక్షన్ చిత్రాల్లో ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. దీంతో ఈ మూవీ సీక్వెల్ పై సహజంగానే భారీ హైప్ నెలకొని ఉంది. భాషతో సంబంధం లేకుండా కెజిఎఫ్ 2 కోసం దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎదురుచూస్తున్నారు.