మహేష్ బాబు సినిమాలో ఉపేంద్ర..తెలుగు సినిమాలపై మళ్ళీ ఫోకస్ చేసిన కన్నడ స్టార్.

By Mahesh Jujjuri  |  First Published Mar 28, 2022, 7:38 PM IST

ఒకప్పుడు తెలుగులో కూడా ఫ్యామిలీ హీరోగా గుర్తింపు పొందారు కన్నడ స్టార్ ఉపేంద్ర. కొంత గ్యాప్ తరువాత విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు టాలీవుడ్ లో.. ఆతరువాత కూడా గ్యాప్ తీసుకున్న ఉపేంద్ర ఇప్పుడు తెలుగుపై గట్టిగా ఫోకస్ చేశాడు. 


ఒకప్పుడు తెలుగులో కూడా ఫ్యామిలీ హీరోగా గుర్తింపు పొందారు కన్నడ స్టార్ ఉపేంద్ర. కొంత గ్యాప్ తరువాత విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు టాలీవుడ్ లో.. ఆతరువాత కూడా గ్యాప్ తీసుకున్న ఉపేంద్ర ఇప్పుడు తెలుగుపై గట్టిగా ఫోకస్ చేశాడు. 

చాలా కాలం క్రితమే తెలుగులో హీరోగా స్ట్రైట్ సినిమాలు చేసిన హిట్లు కొట్టారు. ఈ మధ్య కాలంలో తెలుగులో సన్నాఫ్ సత్యమూర్తి సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇచ్చిన ఉపేంద్ర మళ్లీ టాలీవుడ్ లో బిజీ అవుతున్నారు. వరుసగా తెలుగులో  ఆఫర్లు అందుకుంటున్నాడు. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో పవర్ఫుల్ రోల్ చేసిన ఆయన, గని సినిమాలో ఓ కీరోల్ పోషించారు. ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ సినిమాలోనే నటించబోతున్నారు. 

Latest Videos

ఇక తాజాగా మహేశ్ బాబు సినిమా కోసం ఉపేంద్రను త్రివిక్రమ్ ఎంపిక చేసినట్టు  తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఈవార్త హల్ చల్ చేస్తోంది.అయితే ముందుగా  ఈ సినిమాలో ఒక కీలమైన పాత్ర కోసం మోహన్ లాల్ ను సంప్రదించారట మేకర్స్. ఆతరువాత ఏమైందో ఏమో తెలియదు కాని ... ఈ సినిమా విషయంలో మాత్రం  తాజాగా ఉపేంద్ర పేరు తెరపైకి వచ్చింది. మోహన్ లాల్ కి బదులుగా ఉపేంద్రను తీసుకున్నారా? లేదంటే ఆయనతో పాటు ఉపేంద్ర కూడా ఉన్నారా? అనే విషయంలో  క్లారిటీ రావలసి ఉంది. 

అయితే ఉపేంద్ర చేతిలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి వస్తున్నాయి. తాజాగా సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో కూడా సినిమా అనౌన్న్ చేశారు ఉపేంద్ర. ఈ మూవీలో ఉపేంద్ర గ్యాంగ్ స్టార్ గా నటించబోతున్నాడు. మాస్ ఫాలోయింగ్ ఉన్న ఉపేంద్రను వర్మ స్టైల్ లో ఇంకా డిఫరెంట్ గా చూపించబోతున్నారు. 

ఇక మహేష్ విషయానికి వస్తే.. ప్రస్తుతం మహేశ్ బాబు నటిస్తోన్న సర్కారువారి పాట సినిమా షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. దాదాపుగా ఈమూవీముగింపు దశలో ఉంది. కీర్తి  సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నఈ సినిమాను మే 12న ప్రపంచ వ్యాప్తంగా  భారీస్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఆ తరువాత మహేష్ త్రివిక్రమ్ ప్రాజెక్టు లో జాయిన్ కాబోతున్నాడు. ఈ మూవీలో హీరోయిన్ గా  పూజ హెగ్డే  నటించబోతోంది.
 

click me!