మహేష్ ని కలిసిన కన్నడ స్టార్ హీరో,రూమర్స్ స్టార్ట్

By Udaya DFirst Published Feb 13, 2019, 7:42 AM IST
Highlights

మన తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబుని అన్ని భాషల స్టార్స్ ఇష్టపడుతూంటారు. అటు షారూఖ్ కావచ్చు...ఇట విజయ్ సేతుపతి కావచ్చు..ఎవరైనా దగ్గరలో మహేష్ షూటింగ్ ఉంటే కలిసి వెళ్తూంటారు. 

మన తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబుని అన్ని భాషల స్టార్స్ ఇష్టపడుతూంటారు. అటు షారూఖ్ కావచ్చు...ఇట విజయ్ సేతుపతి కావచ్చు..ఎవరైనా దగ్గరలో మహేష్ షూటింగ్ ఉంటే కలిసి వెళ్తూంటారు. అదిగో అలాగే కన్నడ పరిశ్రమలో స్టార్ గా వెలుగుతున్న శ్రీ మురళి కూడా వచ్చి మహేష్ ని కలిసారు.

హైదరాబాద్ లో శ్రీమురళి నటిస్తున్న కన్నడ చిత్రం షూటింగ్ జరుగుతోంది. అదే స్టూడియోలో మహేష్ బాబు కూడా సినిమా చేస్తున్నారని తెలిసింది. వెంటనే మహర్షి సెట్ మీద ప్రత్యక్ష్యమయ్యారు.  వెంటనే మహేష్ చాలా ఆదరంగా శ్రీమురళిని రిసీవ్ చేసుకుని కొద్ది సేపు మాట్లాడారు. శ్రీ మురళి సూపర్ హిట్ ఉగ్రం గురించి కూడా డిస్కస్ చేసినట్లు సమాచారం. అయితే కన్నడ మీడియాలో ఓ వర్గం...మహేష్ సినిమాలో శ్రీమురళి ఓ పాత్ర చేస్తున్నాడంటూ రూమర్స్ స్టార్ట్ చేసేసింది. 

ఇక మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘మహర్షి’. పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. మార్చినాటికి షూటింగ్ పూర్తి చేసి, ఏప్రిల్‌ తొలివారంలో సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. 

అమెరికా నుంచి సొంత ఊరు వచ్చి, ఇక్కడి ప్రజల కోసం పాటు పడే యువకుడిగా మహేష్‌ పాత్ర ఉండబోతోందని, స్నేహం, ప్రేమ, త్యాగం.. ఈ అంశాల చుట్టూ ఈ సినిమా సాగనుందని సమాచారం. అల్లరి నరేష్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌, పీవీపీ సినిమా పతాకాలపై దిల్‌రాజు, అశ్వనీదత్‌, ప్రసాద్‌ వి.పొట్లూరిలు నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఏప్రిల్‌ 5న ‘మహర్షి’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

click me!