
కన్నడ స్టార్ హీరో యష్ (Yash) నటించిన ‘కేజీఎఫ్ ఛాప్టర్ 1’ (KGF Chapter 1) కన్నడ ఇండస్ట్రీ నుంచి సరిగ్గా మూడేండ్ల కింద ఎలాంటి అంచనాలు లేకుండా పాన్ ఇండియన్ మూవీగా రిలీజ్ అయింది. కానీ అన్ని ఇండస్ట్రీల బాక్సాఫీస్ ను షేక్ చేసింది కేజీఎఫ్. రూ.80 కోట్లతో పూర్తైయిన ఈ చిత్రం రూ.250 కోట్లు రాబట్టింది. భారీ విజువల్స్, సెట్టింగ్స్, యష్ మేనరిజం, స్టోరీ ఆడియెన్స్ కు చాలా బాగా నచ్చాయి. ఛాప్టర్ వన్ రిలీజ్ కు మందే.. KGF Chapter 2ను కూడా అనౌన్స్ చేశారు. మేకర్స్. మూడేండ్ల తర్వాత ఎట్టకేళలకు ఏప్రిల్ 14న అన్ని భాషల్లో రిలీజ్ కానుంది. ఇఫ్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, ఫస్ట్ సింగిల్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది.
ఇక ఇప్పటికే ట్రైలర్ లాంచ్ ఈవెంట్, తదితర ప్రమోషన్ కార్యక్రమాలతో సినిమాపై భారీ హైప్ పెంచేశారు. మరోవైపు ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సంజయ్ దత్ (Sanjay Dutt) కూడా ప్రత్యర్థి పాత్రలో నటిస్తుండటంతో ఛాప్టర్ 2పై మరింత ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో మేకర్స్ మరో క్రేజీ అప్డేట్ అందించారు. కేజీఎఫ్ ఛాప్టర్ 2 రిలీజ్ కు ఇంకాస్తా టైం మిగిలి ఉండటం, ఛాప్టర్ 1 రిలీజ్ అయి మూడేండ్లు గడిచిపోవడంతో ఛాప్టర్ 1ను మళ్లీ రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది.
అయితే, ఏప్రిల్ 14న ఛాప్టర్ 2 రిలీజ్ అవుతుండగా... ఏప్రిల్ 8 నుంచి 13 వరకు ఛాప్టర్ 1ను రిలీజ్ కానుందట. ఈ మేరకు దేశవ్యాప్తంగా కొన్ని థియేటర్స్ లలోనే సెలెక్టెడ్ గా రిలీజ్ చేయనున్నారు. నిర్మాత కార్తీక్ గౌడ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కేజీఎఫ్ 1, 2ను దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్ట్ చేశాడు. యష్, శ్రీనిధి, సంజయ్ దత్, రవీనా టండన్ ప్రముఖ నటిస్తున్నారు.