
సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. వరుస గా డిఫరెంట్ సినిమాలు చేసుకుంటున్న వర్మ.. మరో సంచలన సినిమాను ప్రకటించారు. అది కూడా కన్నడ స్టార్ హీరోతో.
ఈ సారి ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు ఆర్జీవీ. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, ఆర్జీవి ఈ సినిమాకు ఒక కన్నడ స్టార్ హీరోను తీసుకున్నారు. కన్నడ నాట యాక్షన్ హీరోగా.. తెలుగులో క్యారెక్టర్ రోల్స్ చేస్తున్న ఉపేంద్రతో యాక్షన్ ఎంటర్టైనర్ ను ప్లాన్ చేశాడు ఆర్టీవి. ఇక ఈ రేర్ కాంబోలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఆర్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.
ఈ సినిమాకు సంబంధించి రెండు గ్లింప్స్ లను వర్మ రిలీజ్ చేశారు. ఒక భయంకరమైన గ్యాంగ్ స్టర్ పాత్రలో ఉపేంద్ర నటిస్తున్నాడు. చిత్రానికి ఏ స్క్వేర్ ప్రొడక్షన్స్ ఈ ఆర్ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే వరుసగా కాంట్రవర్సియన్ మూవీస్.. బోల్డ్ మూవీస్ తో అదరగొడుతున్న వర్మ. ఈసారి ఉపేంద్రతో ఎంత రచ్చ చేస్తారో అన ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అటు ఉపేంద్ర కూడా వర్మలాగానే కాంట్రవర్సియల్ స్టార్.. మరి ఈ ఇద్దరు వివాదాస్పద వ్యాక్తుల కాంబినేషన్ లో సినిమా.. ఎటువంటి వివాదాలకు దారితీస్తుందా అని అనుకుంటున్నారు.
ఈ మధ్యన ఆయన వైవిధ్యం పేరుతో వింత సినిమాలు,వెరైటీ కాన్సెప్టులను తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా శృంగారానికి ఆయన పెద్ద పీట వేస్తున్నారు. ఒకప్పుడు వర్మ అంటే ఓ కొత్త తరహా సినిమా చూస్తామనే ఆ పేరును ఆయన ఎప్పుడో పోగొట్టుకున్నారు. ముఖ్యంగా ఓటీటీలు వచ్చాక మరీ రెచ్చిపోతున్నారు. ఓటిటి ప్లాట్‌ఫామ్‌లను దృష్టిలో ఉంచుకునే సినిమాలను తీస్తున్నారు. తాజాగా అలాంటి కాన్సెప్ట్‌తోనే ఆయన ఇంకో సినిమాను ముస్తాబు చేసి రిలీజ్ కు రెడీ చేసారు. ముందుగా ఈ మూవీకి డేంజరస్ అని పేరు పెట్టారు. కానీ టైటిల్‌కు.. కథకు పోలిక లేదని చెప్పి టైటిల్‌ను మార్చారు. ఈ క్రమంలోనే డేంజరస్ సినిమా పేరును మా ఇష్టంగా మార్చి ట్రైలర్ వదిలారు.