కరోనాకు మరో సీనియర్‌ నటుడు బలి.. ఇండస్ట్రీలో విషాదం

By Satish ReddyFirst Published Jul 19, 2020, 3:52 PM IST
Highlights

తాజాగా కన్నడ పరిశ్రమ కరోన వైరస్‌ కారణంగా మరో సీనియర్‌ను కోల్పోయింది. 70 ఏళ్ల సీనియర్‌ నటుడు హల్వానా గంగాధర్‌కు కొద్ది రోజుల క్రితం కరోనా సోకినట్టుగా నిర్థారణ అయ్యింది. కొంత కాలం ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకున్న ఆయన ఇటీవల శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు రావటంతో బెంగళూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు.

కరోన మహమ్మారి వినోద పరిశ్రమను తీవ్ర స్థాయిలో దెబ్బతీస్తోంది. షూటింగ్‌లు, సినిమాలు లేక ప్రజలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతుండగా వరుసగా మరణాలు ఇండస్ట్రీని కలవరపెడుతున్నాయి. ఇప్పటికే కరోనా కారణంగా పలువురు సీనియర్  నటుడు మృతి చెందగా తాజాగా కన్నడ పరిశ్రమ ఈ మహమ్మారి కారణంగా మరో సీనియర్‌ను కోల్పోయింది. 70 ఏళ్ల సీనియర్‌ నటుడు హల్వానా గంగాధర్‌కు కొద్ది రోజుల క్రితం కరోనా సోకినట్టుగా నిర్థారణ అయ్యింది.

కొంత కాలం ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకున్న ఆయన ఇటీవల శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు రావటంతో బెంగళూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించటంతో శనివారం సాయంత్రం ఆయన తుది శ్వాస విడిచినట్టుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు. గంగాధర్‌కు భార్య, ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. రంగస్థల నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సాధించిన గంగాధర్‌ 1500 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు.

ఆ అనుభవంతోనే సినీ రంగంలోకి అడుగుపెట్టి దాదాపు 120కి పైగా సినిమాల్లో నటించారు. ఆయన మృతిపట్ల కన్నడ సినీ పరిశ్రమ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. ప్రముఖ దర్శకుడు, గంగాధర్‌ స్నేహితుడు ఎన్‌ సీతారామ్‌ మాట్లాడుతూ.. దాదాపు 127 షోలకు మేం ఇద్దరం కలిసి పనిచేశాం. వారం క్రితమే ఆయన్ను చివరిసారిగా చూశాను అని గుర్తు చేసుకున్నారు. కర్ణాటకలో వైరల్‌ తీవ్ర రూపం దాల్చింది. దీంతో పలు ప్రాంతాల్లో స్వచ్చందంగా ప్రజలు లాక్‌ డౌన్‌ విధించుకోగా బెంగళూరు లాంటి ప్రాంతాల్లో ప్రభుత్వం మరోసారి లాక్‌ డౌన్‌ విధించింది.

click me!