వ‌ర్మ‌పై పవన్ ఫ్యాన్స్ సినిమా…టైటిల్ ఇదే!

Surya Prakash   | Asianet News
Published : Jul 19, 2020, 11:40 AM IST
వ‌ర్మ‌పై పవన్ ఫ్యాన్స్ సినిమా…టైటిల్ ఇదే!

సారాంశం

ఈ సినిమాలో అసలు  వ‌ర్మ కెరీర్ ఎలా మొద‌లైంది? ఏ స్దాయికు వెళ్లి ..వెనక్కి వచ్చి ఎలా ప‌త‌న‌మైంది?అనేది చూపెడటమే కాకుండా ఈ సినిమాలో వర్మ అర్దంరాత్రి వోడ్కా తాగి చేసే ట్వీట్స్ గురించి, ఆయన అందరినీ కెలికే వ్యక్తిత్వం గురించి అన్ని ఈ సినిమాలో ఉండబోతున్నాయట. అంతేకాదు ఈ సినిమా కూడా ఓటీటీలోనే విడుద‌ల కానుంది. 

రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం పవర్ స్టార్ అనే సినిమా చేస్తూ ..పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు కోపం తెప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కంటెంట్ ఎలా ఉన్నా...నెగిటివ్ గా సినిమా ఉంటుందేనే ప్రచారం మాత్రం సోషల్ మీడియాలో జరుగుతోంది. అదే గనక జరిగితే...పవన్ కళ్యాణ్ పై బ్యాడ్ ప్రోపగాండ జరుగుతుంది. ఈ విషయం గమనించిన పవన్ ఫ్యాన్...డైరక్ట్ గానే వర్మని తిట్టిపోస్తున్నారు. అలాగే పవర్ స్టార్ లో హీరోగా చేస్తున్న అతనికి వార్నింగ్ లు ఇస్తున్నారు. అయితే వర్మ అవన్నీ పట్టించుకోవటం లేదు. మరింతగా దూసుకుపోతు ఈ సినిమా ట్రైలర్, సినిమా రిలీజ్ డేట్స్ సైతం ప్రకటించేసారు. ఈ నేపధ్యంలో కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ విషయాన్ని సినిమా ద్వారానే ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. 

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా టైటిల్ `ప‌రాన్న‌జీవి`. ప‌వ‌న్ అభిమానులు కొంత‌మంది క‌లిసి ఈ ప్రాజెక్టు డిజైన్ చేసిన‌ట్టు వినపడుతోంది. ఈ సినిమాలో అసలు  వ‌ర్మ కెరీర్ ఎలా మొద‌లైంది? ఏ స్దాయికు వెళ్లి ..వెనక్కి వచ్చి ఎలా ప‌త‌న‌మైంది?అనేది చూపెడటమే కాకుండా ఈ సినిమాలో వర్మ అర్దంరాత్రి వోడ్కా తాగి చేసే ట్వీట్స్ గురించి, ఆయన అందరినీ కెలికే వ్యక్తిత్వం గురించి అన్ని ఈ సినిమాలో ఉండబోతున్నాయట. అంతేకాదు ఈ సినిమా కూడా ఓటీటీలోనే విడుద‌ల కానుంది. 

ఈ సినిమా చూసిన వారు వర్మ తనపై తాను సినిమా తీసున్నాడు అనేలా తీస్తారట. ఇప్పటికే ఈ సినిమా ప్రారంభమయ్యాయని టాక్. వర్మ లాగ కనిపించే ఓ జూనియర్ ఆర్టిస్ట్ ని ఈ సినిమా కోసం ఇప్పటికే వెతికిపట్టుకున్నారట. త్వరలో పోస్టల్ లాంచ్ అవుతుందని, పవన్ ఫ్యాన్స్ అందరూ దాన్ని ట్రెండ్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. మొత్తానికి వర్మకు కౌంటర్ రాబోతోందన్నమాట. సరేగానీ జొన్నవిత్తుల మొదలెట్టిన ‘ఆర్జీవి’ సినిమా ఏమైందో. 
 

PREV
click me!

Recommended Stories

Jananayagan Release: జననాయగన్ రిలీజ్ ఎందుకు ఆలస్యం? నిజం చెప్పడానికి డైెరెక్టర్ ఎందుకు భయపడుతున్నారు?
Toxic Movie: బయటపడ్డ తెరవెనుక రహస్యం, యష్ టాక్సిక్ మూవీ మేకింగ్ వీడియో వైరల్..