పరిశ్రమలో తీవ్ర విషాదం... రోడ్డు ప్రమాదంలో యువహీరో  మృతి!

Published : Jun 14, 2021, 01:48 PM IST
పరిశ్రమలో తీవ్ర విషాదం... రోడ్డు ప్రమాదంలో యువహీరో  మృతి!

సారాంశం

బ్రెయిన్ లో రక్తం గడ్డకట్టడంతో వైద్యులు సర్జరీ చేశారు. రెండు రోజులుగా చికిత్స అందిస్తున్నా ఆయన బాడీ సహకరించడం లేదని డాక్టర్స్ చెప్పారు. బ్రెయిన్ డెడ్ కూడా కావడంతో బ్రతకడం కష్టం అని తేల్చారు. 

కన్నడ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. యువ హీరో సంచారి విజయ్ కన్ను మూశారు. రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన విజయ్ ని ఆసుపత్రిలో చేర్చగా, నేడు ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. స్నేహితులతో పాటు ఇంటికి బైక్ పై వెళుతున్న విజయ్ ప్రమాదానికి గురయ్యారు. విజయ్ తలకు, కాలికి తీవ్ర గాయాలు కావడం జరిగింది. 


బ్రెయిన్ లో రక్తం గడ్డకట్టడంతో వైద్యులు సర్జరీ చేశారు. రెండు రోజులుగా చికిత్స అందిస్తున్నా ఆయన బాడీ సహకరించడం లేదని డాక్టర్స్ చెప్పారు. బ్రెయిన్ డెడ్ కూడా కావడంతో బ్రతకడం కష్టం అని తేల్చారు. దీంతో కుటుంబ సభ్యుల అనుమతితో విజయ్ అవయవాలు దానం చేసినట్లు తెలుస్తుంది. 


కన్నడ పరిశ్రమలో యువ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంచారి విజయ్ అకాల మరణం పరిశ్రమ పెద్దలను, ఆయన ఫ్యాన్స్ ని షాక్ కి గురిచేసింది. మంచి నటుడిగా పేరున్న విజయ్ ట్రాన్స్ జెండర్ పాత్రను అద్భుతంగా చేసి జాతీయ అవార్డు అందుకున్నారు. ఏడాది వ్యవధిలో కన్నడ పరిశ్రమ మరో హీరోని కోల్పోయింది. గత ఏడాది చిరంజీవి సర్జా గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. గత ఏడాది ఇదే రోజున సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. 
 

PREV
click me!

Recommended Stories

Balakishna: `అఖండ 2` డిజాస్టర్‌ దెబ్బ.. బాలయ్య కొత్త సినిమాకి బడ్జెట్‌ కష్టాలు.. ఆగిపోయిందా?
ప్రభాస్ జోకర్ గెటప్ వెనుకున్న వ్యక్తి ఎవరంటే.? మనసులోని మాట చెప్పిన డైరెక్టర్ మారుతీ