స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ‘భోళా శంకర్’లో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. ఇక తాజాగా డబ్బింగ్ పనులు కూడా షూరు చేశారు.
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) వరుస సినిమాలతో అలరిస్తున్నారు. చివరిగా తెలుగులో సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’తో అలరించింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న ‘భోళా శంకర్’లో నటిస్తోంది. ఈ చిత్రంతో మునుపెన్నడు చేయని సాహసం చేస్తోంది కీర్తి సురేష్. చిరంజీవికి చెళ్లెలి పాత్రలో కీర్తి అలరించబోతోంది.
టాలీవుడ్, కోలీవుడ్ లో వరుసగా ఆఫర్లు అందుకుంటున్న క్రమంలో కీర్తి చెల్లెలు పాత్రలో కనిపించబోతుండటం ఆసక్తికంగా మారింది.ఇప్పటికే తన వంతు షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకుంది కీర్తి. దీంతో తాజాగా డబ్బింగ్ కూడా షురూ చేసినట్టు అప్డేట్ ఇచ్చింది. డైరెక్టర్ మెహర్ రమేశ్ (Meher Ramesh) తో కలిసి స్టూడియోలో ఉన్న కొన్ని ఫొటోలను పంచుకుంది. డబ్బింగ్ పార్ట్ కూడా పూర్తి చేసుకోనున్నట్టు తెలిపింది. అలాగే మెగా అభిమానులకు గుడ్ న్యూస్ కూడా చెప్పింది. త్వరలో బోళా శంకర్ టీజర్ కూడా రాబోతోందని అప్డేట్ ఇచ్చింది. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
ఇదిలా ఉంటే.. కీర్తి సురేష్ డబ్బింగ్ షురూ అయినట్టు అప్డేట్ ఇస్తూ ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. డైరెక్టర్ మెహర్ రమేష్ ను ‘అన్న’ అంటూ సంబోధించింది. దీంతో మెహర్ రమేశ్ హీరోయిన్లతో ఎలా ఉంటారనేది అర్థం చేసుకోవచ్చు.. ప్రస్తుతం టీమ్ క్లైమాక్స్ ను షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ మూసాపేట ప్రాంతంలో లేటెస్ట్ షెడ్యూల్ జరుగుతుందని సమాచారాం. కొన్ని రోజులు షూటింగ్ ఇక్కడే జరగనుంది.
ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తి కావస్తుండటంతో ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా షురూ చేశారు. సూపర్ ఫాస్ట్ గా పనులు జరుగుతున్నాయి. మరోవైపు సినిమాపై హైప్ పెంచేందుకు టీమ్ అప్పుడప్పుడు అప్డేట్ వదులుతూనే ఉంది. అలాగే చిరు లీక్స్ ద్వారా మెగాస్టార్ కూడా అప్డేట్స్ ఇస్తున్నారు. త్వరలో మరో క్రేజీ సాంగ్స్ కూడా రాబోతుంది. చిత్రంలో మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaah Bhatia) హీరోయిన్ గా నటిస్తోంది. కీర్తి సురేష్ తో పాటు సుశాంత్, మురళీ శర్మ, రవి శంకర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది.