Kanika Kapoor: రెండో భర్తతో విడాకులు ప్రకటించిన సింగర్.. 4 ఏళ్ళ వివాహ బంధానికి ముగింపు, 48 ఏళ్ళ వయసులో ఇలా

Published : Nov 04, 2026, 11:37 AM IST
Kanika Kapoor

సారాంశం

బాలీవుడ్ సింగర్ కనికా కపూర్, ఆమె భర్త గౌతమ్ హతిరమణి విడిపోతున్నట్లు ప్రకటించారు. చాలా ఏళ్లుగా స్నేహితులుగా ఉన్న వీరు 2022 మే నెలలో లండన్‌లో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు నాలుగేళ్ల బంధానికి ముగింపు పలికారు.

ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ కనికా కపూర్, ఆమె భర్త గౌతమ్ హతిరమణి విడిపోవాలని నిర్ణయించుకున్నారు. లండన్, లాగోస్ కేంద్రంగా గౌతమ్ వ్యాపారాలు చేస్తుంటారు. నాలుగేళ్ల పాటు కలిసి ఉన్న ఈ జంట, ఇప్పుడు తమ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని కనికా కపూర్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తాము స్నేహపూర్వకంగానే విడిపోతున్నామని, ఈ సమయంలో తమ ప్రైవసీని గౌరవించాలని ఆమె కోరారు.

చాలా కాలం పాటు స్నేహితులుగా ఉండి, ఆ తర్వాత భార్యాభర్తలుగా మారిన వీరి ప్రయాణం అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు ఈ హై-ప్రొఫైల్ జంట విడిపోవడం చర్చనీయాంశమైంది. ఒకరి వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలను మరొకరు గౌరవించుకుంటూనే, పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇద్దరూ స్పష్టం చేశారు.

ప్రేమ, పెళ్లి.. లండన్‌లో వేడుక

దాదాపు 15 ఏళ్ల పాటు వీరిద్దరూ మంచి స్నేహితులుగా ఉన్నారు. ఆ తర్వాత ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారింది. 2021 ఆగస్టులో కనికా కపూర్‌కు గౌతమ్ ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత ఏడాదికే వీరు పెళ్లి పీటలెక్కారు.

2022 మే 20న లండన్‌లో వీరి వివాహం చాలా సింపుల్‌గా జరిగింది. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ బాలీవుడ్ సింగర్, ఇంటర్నేషనల్ బిజినెస్‌మెన్ ఒక్కటయ్యారు.

గౌతమ్ హతిరమణి ఎవరు?

గౌతమ్ హతిరమణి ఒక ప్రముఖ అంతర్జాతీయ వ్యాపారవేత్త. ఆయన లండన్, లాగోస్ నగరాల కేంద్రంగా తన వ్యాపారాలను నిర్వహిస్తుంటారు. వ్యాపార రంగంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ఆయన తన వ్యక్తిగత జీవితాన్ని చాలా గోప్యంగా ఉంచుతారు.

2022లో బాలీవుడ్ సింగర్‌తో పెళ్లి వార్తలు బయటకు వచ్చే వరకు గౌతమ్ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. వీరి ప్రేమ, పెళ్లి గురించి మీడియాలో ఎంత కోలాహలం జరిగినప్పటికీ, ఆయన తన వ్యాపార, వ్యక్తిగత విషయాలను ఎప్పుడూ పబ్లిక్ చేయలేదు.

విడాకులకు కారణం అదేనా?

వీరు విడిపోతున్నారనే వార్త బయటకు రాగానే, సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు మొదలయ్యాయి. విడాకులకు కారణం ఇదేనంటూ నెట్టింట చర్చలు జరిగాయి. ఈ పుకార్లపై కనికా కపూర్ నేరుగా స్పందిస్తూ అసలు విషయానికి క్లారిటీ ఇచ్చారు.

తమ బంధంలో మోసం జరిగిందనే వార్తలను ఆమె తీవ్రంగా ఖండించారు. అలాగే, లాగోస్‌కు వెళ్లడం ఇష్టం లేకనే విడిపోతున్నారనే ప్రచారంలో కూడా నిజం లేదన్నారు. ఇద్దరి ప్రయాణాలు, బిజీ వర్క్ షెడ్యూల్స్ వల్లే తమ మధ్య దూరం పెరిగిందని ఆమె వివరించారు. తాము చాలా స్నేహపూర్వకంగానే విడిపోతున్నామని, ఇన్నాళ్లు కలిసి ఉన్నందుకు సంతోషంగా ఉందని ఆమె చెప్పారు.

కనికా కపూర్ మొదటి పెళ్లి, పిల్లలు

2022లో జరిగిన పెళ్లి కనికా కపూర్‌కు రెండవది. అంతకుముందు 1998లో ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త రాజ్ చందోక్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 2012లో వీరిద్దరూ విడిపోయారు.

మొదటి వివాహం ద్వారా కనికా కపూర్‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి పేర్లు యువరాజ్, ఆయానా, సమర. 2022 మే 20న లండన్‌లో గౌతమ్‌తో జరిగిన ఆమె రెండో పెళ్లి వేడుకలో ఈ ముగ్గురు పిల్లలు కూడా పాల్గొన్నారు.

కెరీర్‌పైనే ఫోకస్

'బేబీ డాల్', 'చిట్టియాన్ కలైయాన్' లాంటి సూపర్ హిట్ పాటలతో కనికా కపూర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె ఇండియా, విదేశాల్లో తన మ్యూజిక్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు. నాలుగేళ్ల పాటు కలిసి ప్రయాణించిన ఈ జంట, ఇప్పుడు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు.

ఇకపై ఇద్దరం తమ తమ వృత్తిపరమైన పనులపైనే దృష్టి పెడతామని, ఒకరిపై ఒకరికి ఎప్పటికీ గౌరవం ఉంటుందని కనికా కపూర్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో గౌతమ్ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆమె ఆకాంక్షించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Renu Desai: పవన్ కళ్యాణ్ కోసం రేణు దేశాయ్ లండన్ లో ఏం చేశారో తెలుసా.. అక్కడికి వెళ్ళేది వాళ్లిద్దరు మాత్రమే
Anirudh Kavya Wedding: అనిరుధ్ కావ్య మారన్ పెళ్లి కార్డు వెనుక ఇంత పెద్ద కథ ఉందా? వైరల్ అవుతున్న విశేషాలు