Sai Pallavi: జీవితంలో భయంకరమైన సంఘటన, సాయి పల్లవి హనుమాన్ చాలీసా నేర్చుకోడానికి కారణం అదే?

Published : Oct 31, 2026, 03:03 PM IST
Sai Pallavi Reveals How Kasol Forest Incident

సారాంశం

Sai Pallavi: రామాయణం సినిమాలో సీతగా నటిస్తున్న సాయి పల్లవి హనుమాన్ చాలీసా ఎలా నేర్చుకుందో బయటపెట్టింది. సినిమా కోసం కాదట, కసోల్ అడవిలో జరిగిన ఓ భయానక సంఘటనే దీనికి కారణమట. అసలేంటి ఆ స్టోరీ?

Sai Pallavi: ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ అవేటెడ్ మూవీ 'రామాయణం' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తోంది. అయితే ఆమె హనుమాన్ చాలీసా నేర్చుకుంది ఈ సినిమా కోసం కాదట. హిమాచల్ ప్రదేశ్‌లోని కసోల్ అడవిలో జరిగిన ఓ సంఘటన తర్వాతే తను హనుమాన్ చాలీసా చదవడం మొదలుపెట్టానని సాయి పల్లవి స్వయంగా చెప్పుకొచ్చింది.

జీవితాన్ని మార్చేసిన సంఘటన

రామాయణం సినిమా ప్రమోషన్స్ టైమ్‌లో సాయి పల్లవి ఈ ఆసక్తికరమైన విషయాన్ని షేర్ చేసుకుంది. హిమాచల్ ప్రదేశ్‌లోని ఫేమస్ టూరిస్ట్ స్పాట్ కసోల్, పార్వతీ వ్యాలీ అడవుల్లో రాత్రి పూట ఇరుక్కుపోయినప్పుడు జరిగిన ఓ సంఘటన తన జీవితాన్నే మార్చేసిందని ఆమె చెప్పింది.

చీకటి పడుతుంటే పెరిగిన భయం

ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ.. తన చెల్లి పూజా కన్నన్, స్నేహితులతో కలిసి పార్వతీ వ్యాలీకి ట్రిప్ వెళ్లానని చెప్పింది. ట్రిప్ ముగించుకుని తిరుగు ప్రయాణంలో సాయంత్రం 5 గంటలకు ఉన్న లాస్ట్ బస్సు మిస్ అయ్యారట. వేరే బస్సు లేదు, అక్కడ ఉండటానికి ఎలాంటి వసతి లేదు. వేరే దారి లేక నడుచుకుంటూనే వెనక్కి బయలుదేరారు. అప్పటికే సాయంత్రం అయిపోయింది. కొండలు, దట్టమైన అడవి మధ్య నడవాలి. చీకటి పడుతుండటంతో ముగ్గురికీ భయం పట్టుకుంది.

ఒకవైపు ఉధృతంగా ప్రవహిస్తున్న నది, మరోవైపు కటిక చీకటితో ఉన్న దట్టమైన అడవి. ఆ మసక వెలుతురులో అడుగులు వేస్తుంటే సాయి పల్లవికి విపరీతమైన భయం వేసిందట. ఆ టెన్షన్ టైమ్‌లో తన చెల్లి పూజ గట్టిగా హనుమాన్ చాలీసా చదవడం మొదలుపెట్టింది. పూజ మొదటి లైన్ చదవగానే, ఎక్కడినుంచో ఓ చిన్న కుక్కపిల్ల వచ్చి వాళ్లతో పాటు నడవడం స్టార్ట్ చేసింది.

అప్పుడు హనుమాన్ చాలీసా రాదు

అంత పెద్ద అడవిలో సడెన్‌గా వచ్చిన ఆ కుక్కపిల్ల.. వాళ్లు సేఫ్‌గా లైట్లు, షాపులు ఉన్న ఏరియాకు చేరుకునే వరకు తోడుగా నడిచింది. ఊళ్లోకి రాగానే ఆ కుక్కపిల్ల వెళ్లిపోయింది. దేవుడే ఆ కుక్కపిల్ల రూపంలో వచ్చి మమ్మల్ని కాపాడాడని నాకు అనిపించింది. ఆ టైమ్‌లో నాకు హనుమాన్ చాలీసా రానందుకు చాలా బాధపడ్డాను అని సాయి పల్లవి ఎమోషనల్ అవుతూ చెప్పింది.

ఆ పవిత్ర శ్లోకంతోనే ధైర్యం

ఆ సంఘటన తర్వాత సాయి పల్లవి వెంటనే హనుమాన్ చాలీసా మొత్తం నేర్చుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రోజుకు ఒక్కసారైనా హనుమాన్ చాలీసా చదవడం అలవాటు చేసుకుంది. ఈ పవిత్ర శ్లోకం తనకు ఎంతో ధైర్యాన్ని, మానసిక ప్రశాంతతను ఇస్తుందని నితీష్ తివారీ డైరెక్ట్ చేస్తున్న 'రామాయణం' సినిమాలో సీతమ్మగా నటిస్తున్న సాయి పల్లవి తన నమ్మకాన్ని పంచుకుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Jailer 2 Collection: 800 కోట్ల మార్క్‌కు చేరువలో జైలర్ 2, రజనీకాంత్ సినిమా 1000 కోట్లు సాధించగలదా?
Bigg Boss 10: ఎనిమిదో వారం షాకింగ్‌ ఎలిమినేషన్‌, బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌ నుంచి రైతు బిడ్డ ఔట్‌?