మ్యారేజ్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన మెగాహీరో.. కండీషన్స్ అప్లై

Published : Dec 24, 2020, 09:40 AM IST
మ్యారేజ్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన మెగాహీరో.. కండీషన్స్ అప్లై

సారాంశం

ఇప్పుడు మరో మెగా హీరో కూడా మ్యారేజ్‌కి సిద్ధమవుతున్నాడట. ఇంట్లో ఇప్పటికే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు చెప్పాడు.  ఆ హీరో ఎవరో కాదు సాయితేజ్‌. `సోలో బతుకే సో బెటర్‌` చిత్రంతో రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 

కరోనాతో టాలీవుడ్‌లో పెళ్ళి సందడి మొదలైంది. వరుసగా యంగ్‌ హీరోలు పెళ్ళిళ్లు చేసుకుంటున్నారు. నితిన్‌, రానా, నిఖిల్‌, నిహారిక, వివేక్‌ ఆత్రేయ వంటి వారు ఇప్పటికే మ్యారేజ్‌ చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌లోకి అడుగుపెట్టారు. కొత్త పెళ్లికి సంబంధించిన విశేషాలను ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇప్పుడు మరో మెగా హీరో కూడా మ్యారేజ్‌కి సిద్ధమవుతున్నాడట. ఇంట్లో ఇప్పటికే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు చెప్పాడు. 

ఆ హీరో ఎవరో కాదు సాయితేజ్‌. `సోలో బతుకే సో బెటర్‌` చిత్రంతో రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కాలేజ్‌లో చదివే ఓ కుర్రాడు తన స్నేహితులకు సోలో లైఫ్‌ వల్ల లాభాలేంటని చెప్పే సినిమా ఇది. ఫ్రెష్‌గా కాలేజ్‌ నుంచి బయటకు వచ్చే వాళ్లను హీరో ఎలా ఇన్‌స్పైర్‌ చేశాడనే కథతో రూపొందింది. యూత్‌కి నచ్చే అంశాలతోపాటు, ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా మేళవించి ఉన్నాయని సాయితేజ్‌ చెప్పాడు. 

అయితే త్వరలో ఆయన పెళ్ళి చేసుకోబోతున్నారట. ఇప్పటికే ఇంట్లో మ్యారేజ్‌ చేసుకునేందుకు గ్రీన్‌ ఇచ్చినట్టు ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అమ్మ నుంచి ఫోర్స్ పెరగడంతో, అమ్మ కోసం, ఇంట్లో వాళ్ళ కోసం పెళ్లికి ఓకే చెప్పానన్నాడు. కానీ ఇక్కడే ఓ కండీషన్‌ కూడా పెట్టాడట. ఈ ఏడాది షూటింగ్‌లు ఆగిపోవడంతో తాను కమిట్‌ అయిన సినిమాలు చాలా ఉన్నాయని, ఆ సినిమాలు పూర్తయిన తర్వాతే మ్యారేజ్‌ చేసుకుంటానని కండీషన్‌ పెట్టాడట. దీంతో ఆయన అభిమానుల ఆశలపై కాసిన్ని నీళ్లు చల్లాడని చెప్పొచ్చు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 Finale: కళ్యాణ్ పడాల తలకు గాయం? సింపతీ కోసం పబ్లిసిటీ స్టంట్ చేశారా? నిజమెంత?
అయోమయంలో నందమూరి హీరోల సీక్వెల్ చిత్రాలు.. బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ముగ్గురి పరిస్థితి అంతే