సీక్రెట్ కాల్ చేశాడంటూ అక్షయ్ ని ఇరుకునబెట్టిన కంగనా!

Published : Apr 10, 2021, 06:27 PM IST
సీక్రెట్ కాల్ చేశాడంటూ అక్షయ్ ని ఇరుకునబెట్టిన కంగనా!

సారాంశం

బాలీవుడ్ లో తనను ఇష్టపడేవారు సైతం కొందరికి బయపడి తలైవి ట్రైలర్ గురించి మాట్లాడలేదని అన్నారు. కొందరు మాత్రం తనకు పర్సనల్ ఫోన్ చేసి అభినందించారని కంగనా ఓపెన్ అయ్యారు. వాళ్లలో అక్షయ్ కుమార్ కూడా ఒకరని, ఆయన ట్రైలర్ చూసి తనను ప్రశంసించారని చెప్పారు.


బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ బోల్డ్ కామెంట్స్ తరచుగా వివాదాస్పదం అవుతాయి. బాలీవుడ్ మొత్తం ఒకవైపు, ఆమె ఒకత్తే ఒకవైపు అన్నట్లు కంగనా వ్యవహారం ఉంటుంది. మీటూ ఆరోపణల నుండి నెపోటిజం వరకు కంగనా రనౌత్ చేయని ఆరోపణలు లేవు. ఇక సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య, డ్రగ్స్ వ్యవహారంలో ఆమె ట్వీట్స్, కామెంట్స్ ఎంత పెద్ద వివాదాస్పదం అయ్యాయో తెలిసిందే. ఏకంగా మహారాష్ట్ర గవర్నమెంట్, అధికార పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ ఆమె చెలరేగిపోయారు. 


కాగా ఆమె లేటెస్ట్ మూవీ తలైవి. జయలలిత బయోపిక్ గా తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ ఇటీవల విడుదలైంది. తలైవి ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ దక్కడంతో పాటు, జయలలితగా కంగనా అద్భుతం అంటూ కొందరు కొనియాడారు. తలైవి పాన్ ఇండియా చిత్రం కావడంతో, హిందీ ట్రైలర్ కూడా విడుదల చేశారు. అయితే బాలీవుడ్ ప్రముఖులు ఎవరూ, తలైవి ట్రైలర్ గురించి పెదవి విప్పలేదు. 


ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. బాలీవుడ్ లో తనను ఇష్టపడేవారు సైతం కొందరికి బయపడి తలైవి ట్రైలర్ గురించి మాట్లాడలేదని అన్నారు. కొందరు మాత్రం తనకు పర్సనల్ ఫోన్ చేసి అభినందించారని కంగనా ఓపెన్ అయ్యారు. వాళ్లలో అక్షయ్ కుమార్ కూడా ఒకరని, ఆయన ట్రైలర్ చూసి తనను ప్రశంసించారని చెప్పారు. మరి కంగనా మాటలలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే.. అక్షయ్ పెదవి విప్పాల్సిందే. 


మరోవైపు తలైవి మూవీ విడుదల వాయిదా వేస్తూ దర్శక నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా విపరీతంగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రకటించిన విధంగా మార్చి 23న విడుదల లేదంటూ ప్రకటన చేశారు. త్వరలో తలైవి నూతన విడుదల తేదీ ప్రకటించనున్నట్లు తెలియజేశారు. తలైవి చిత్రాన్ని తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ తెరకెక్కిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్