'వకీల్ సాబ్' థియేటర్ వద్ద గొడవ, కానిస్టేబుల్ పై కత్తితో దాడి

By Surya PrakashFirst Published Apr 10, 2021, 3:16 PM IST
Highlights

 విశాఖపట్నం జిల్లాలోని నార్పలలో కానిస్టేబుల్ పై సినిమా చూడటానికి వచ్చిున వక్తి కత్తితో దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నార్పలలోని శ్రీనివాస థియేటర్ వద్ద వకీల్ సాబ్ చిత్రం షో సమయంలో యువకుల మధ్య గొడవ జరిగింది.

వకీల్ సాబ్ రిలీజ్ హంగామా నిన్నంతా  రేంజిలో నడిచింది. టిక్కెట్లు కోసం జనాలు రచ్చ రచ్చ చేసారు. కరోనాకు సైతం భయపడకుండా థియోటర్స్ దగ్గర బారులు తీరారు. దాదాపు మూడేళ్ల తర్వాత రిలీజైన ఈ సినిమా అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. ఇక బెనిఫిట్ షో సమయంలో అయితే చాలా చోట్ల హారతలు ఇచ్చారు. డాన్స్ లు చేసారు. అయితే అదే సమయంలో కొన్ని చోట్ల బెనిఫిట్ షోలు పడలేదు. మరికొన్ని చోట్ల లేటయ్యాయి. నిడదవోలులో అయితే ఎమ్మల్యే ఈ బెనిఫిట్ షోల విషయంలో కలగ చేసుకోవాల్సి వచ్చింది. అయితే బెనిఫిట్ షో లేటైన చోట్ల మాత్రం థియేటర్స్ పైన దాడికి జనం పాల్పడ్డారు. కుర్చీలు , థియోటర్ గేట్లు విరగ్గొట్టారు. అలాగే థియేటర్స్ పై రాళ్లవర్షం కురిపించారు.
 
అలాగే  విశాఖపట్నం జిల్లాలోని నార్పలలో కానిస్టేబుల్ పై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నార్పలలోని శ్రీనివాస థియేటర్ వద్ద వకీల్ సాబ్ చిత్రం షో సమయంలో యువకుల మధ్య గొడవ జరిగింది.ఈ ఘర్షణను ను అదుపు చేయడానికి వెళ్ళిన గౌస్ అనే కానిస్టేబుల్ పై  పవన్ అనే వ్యక్తి కత్తితో దాడి చేసాడు. ఈ దాడిలో కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. గాయపడిన కానిస్టేబుల్ ను స్థానిక  ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

ఇదిలా ఉంటే ఏపీ లో తప్ప అన్ని చోట్ల ఈ సినిమా బెనిఫిట్ షోస్ పడ్డాయి. అయితే వకీల్ సాబ్ రిలీజ్ విషయంలో జగన్ సర్కార్ కావాలనే బినిఫిట్ షోస్ రద్దు చేసిందని , టికెట్స్ రేటు కూడా పెంచుకోకుండా ఆదేశాలు జారీచేసిందని అభిమానులు , డిస్ట్రిబ్యూటర్స్ ఆందోళన వ్యక్తం చేసారు. ఈ వ్యవహారం ఫై హైకోర్టు కు వెళ్లగా..విచారణ చేపట్టిన కోర్ట్ తీపి కబురు అందజేసింది.

 మూడు రోజుల పాటు టికెట్స్ ధరలు పెంచుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని 13 జిల్లాల కలెక్టర్లకు, రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులను పంపింది. హైకోర్టు ఉత్తర్వులతో అభిమానులు, డిస్ట్రిబ్యూటర్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక సినిమాకు హిట్ టాక్ రావడం తో టికెట్స్ ధరలు పెంచినా అభిమానులు , సినీ ప్రేక్షకులు సినిమాను చూస్తారని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

click me!