మణికర్ణిక షూటింగ్ లో మరోసారి తీవ్రంగా గాయపడ్డ కంగనా రనౌత్

Published : Nov 23, 2017, 11:49 AM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
మణికర్ణిక షూటింగ్ లో మరోసారి తీవ్రంగా గాయపడ్డ కంగనా రనౌత్

సారాంశం

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలీవుడ్ మూవీ మణికర్ణిక ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న మణికర్ణిక లీడ్ రోల్ లో నటిస్తున్న కంగనా రనౌత్ కు మరోసారి తీవ్ర గాయాలు

గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం మణికర్ణిక. బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం జోధ్‌పూర్‌లో జరుగుతుంది.   షూటింగ్ సందర్భంగా కంగనా రనౌత్‌పై స్టంట్స్ సీన్ చిత్రీకరిస్తుండగా..  ప్రమాదశాత్తు కిందపడటంతో ఆమె కాలికి గాయమైంది. వెంటనే యూనిట్ సభ్యులు ఆమెని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

 

అదృష్టవశాత్తు ప్రమాదం ఏమీలేదని కొద్దిరోజుల పాటు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు సలహా ఇచ్చారు. ఇక కంగనాకి రెస్ట్ ఇవ్వడంతో అనుకున్న సమయానికి చిత్రీకరణ జరుగుతుందా? అన్న సందేహాలు నెలకొన్నాయి.

 

అంతేకాక హైదరాబాద్‌లోనూ ఇటీవల ఈ మూవీ చిత్రీకరణ సమయంలో ఓ ఛేజింగ్‌ సీన్‌లో గుర్రం మీద నుండి కిందపడటంతో కంగనాకు గాయాలయ్యాయి.  ‘మణికర్ణిక’ మూవీలో డూప్స్ లేకుండా సాహసోపేతమైన స్టంట్స్ నేరుగా తనే చేస్తుడటం వల్ల కంగనా గాయాలపాలవుతోందని చిత్ర యూనిట్ సభ్యులు చెప్తున్నారు. ఝాన్సీ లక్ష్మీభాయి జీవితం ఆధారంగా బాలీవుడ్లో ‘మణికర్ణిక’ మూవీ తెరకెక్కుతోంది.

PREV
click me!

Recommended Stories

Om Shanti Shanti Shantihi Trailer Review: తరుణ్‌ భాస్కర్‌ కి వణుకు పుట్టించిన ఈషా రెబ్బా, ట్రైలర్‌ ఎలా ఉందంటే?
Sobhita Dhulipala: శోభితకు ఇష్టమైన సినిమా అదే, ఆమె భర్త చైతూది మాత్రం కాదు