హ్రితిక్, కరణ్ జోహార్ లపై కంగనా విమర్శలు!

Published : Mar 04, 2019, 12:55 PM ISTUpdated : Mar 04, 2019, 12:57 PM IST
హ్రితిక్, కరణ్ జోహార్ లపై కంగనా విమర్శలు!

సారాంశం

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రముఖ నటుడు హ్రితిక్ రోషన్, దర్శకుడు కరణ్ జోహార్ లపై సంచలన కామెంట్స్ చేసింది. 

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రముఖ నటుడు హ్రితిక్ రోషన్, దర్శకుడు కరణ్ జోహార్ లపై సంచలన కామెంట్స్ చేసింది. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె కరణ్ జోహార్ బంధుప్రీతిని ప్రోత్సహిస్తారని, తన గురించి హ్రితిక్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని అన్నారు.

కరణ్ జోహార్ ప్రకటించిన ఉత్తమ నటి లిస్ట్ లో తన పేరు లేదని, మూడు సార్లు జాతీయ ఉత్తమ నటి అవార్డు పొందిన వ్యక్తి అతడికి కనిపించలేదని కంగనా మండిపడింది. కరణ్ లాంటి వారు కొందరు నటుల సామర్ధ్యాలను జనాల మనసులో ప్రశ్నార్ధంకంగా మార్చాలని ప్రయత్నిస్తుంటారని అంది.

ఇలాంటి చేయడం వలన తాను మరింత బలంగా నిలదొక్కుకుంటానని తెలిపింది. ఇక హ్రితిక్ రోషన్ గురించి మాట్లాడుతూ.. అతడికంత ప్రాధాన్యత ఇవ్వదలచుకోవడం లేదని చెప్పింది. 1970లలో జనాలు బెల్ బాటమ్ ప్యాంట్లను ఇష్టపడేవారు కానీ ఇప్పుడు అది తలచుకుంటే ఎంత మూర్ఖంగా ప్రవర్తించామా అనిపిస్తుంది.. హ్రితిక్ రోషన్ అంశం కూడా అంతే అంటూ చెప్పింది. 

రెండు సినిమాల్లో దాదాపు ఐదేళ్ల పాటు కలిసి పని చేసినట్లు అటువంటి నేనెవరో తెలియదని హ్రితిక్ చెప్పడం విచారకరమని అన్నారు. ఒకవేళ మీరు కరణ్, హ్రితిక్ ల స్థానంలో ఉంటే ఎలా స్పందిస్తారని ప్రశ్నిస్తే.. అలాంటి సందర్భం తనకు ఎదురుకాదని, నేను ఉన్న చోట వారు ఉండరని నవ్వుతూ బదులిచ్చింది. 

PREV
click me!

Recommended Stories

Mahesh Babu ఎవరో నాకు తెలియదు.. ప్రభాస్ తప్ప అంతా పొట్టివాళ్లే.. స్టార్‌ హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు
ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ డూప్‌గా చేసింది ఎవరో తెలుసా.? ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే.!