హన్సిక సినిమాకు వీడని కష్టాలు!

Published : Mar 04, 2019, 12:22 PM IST
హన్సిక సినిమాకు వీడని కష్టాలు!

సారాంశం

కోలివుడ్ స్టార్ హీరోయిన్ హన్సిక నటిస్తోన్న లేడీ ఓరియెంటెడ్ సినిమా 'మహా'కి మొదటి నుండి ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్లు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. 

కోలివుడ్ స్టార్ హీరోయిన్ హన్సిక నటిస్తోన్న లేడీ ఓరియెంటెడ్ సినిమా 'మహా'కి మొదటి నుండి ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్లు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.

ఈ సినిమా మొదటి పోస్టర్ లో సన్యాసిని దుస్తులు ధరించి, గంజాయి తాగుతూ కనిపించింది హన్సిక. మరో పోస్టర్ లో రక్తంతో నిండి ఉన్న బాత్ టబ్ లో స్నానం చేస్తూ కనిపించింది. హిందూ మతాన్ని, మహిళా సన్యాసులను కించపరిచే విధంగా ఈ పోస్టర్లు ఉన్నాయని, నటి హన్సికపై అలానే చిత్రదర్శకుడు యూఆర్ జమీల్ పై కేసులు నమోదు చేశారు.

వీరిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ కార్యాలయంలో హిందూ మక్కల్మున్నని నేత ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆయన మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం 'మహా' పోస్టర్లపై ఇచ్చిన ఫిర్యాదుకి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకున్నారో.. రెండు వారాల్లో కోర్టుకి  తెలియజేయాలంటూ నగర కమిషనర్ కి ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ సినిమా విడుదల మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. 
 

PREV
click me!

Recommended Stories

Mahesh Babu ఎవరో నాకు తెలియదు.. ప్రభాస్ తప్ప అంతా పొట్టివాళ్లే.. స్టార్‌ హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు
ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ డూప్‌గా చేసింది ఎవరో తెలుసా.? ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే.!