అవుట్ డేటెడ్ జోనర్.. నిర్మాతకు భారీ లాభాలు!

Published : Apr 27, 2019, 03:39 PM IST
అవుట్ డేటెడ్ జోనర్.. నిర్మాతకు భారీ లాభాలు!

సారాంశం

ఒకప్పుడు టాలీవుడ్ లో హారర్, కామెడీ సినిమాలు బాగా ఆడేవి.. 

ఒకప్పుడు టాలీవుడ్ లో హారర్, కామెడీ సినిమాలు బాగా ఆడేవి.. హిట్ జోనర్ కావడంతో వరుస పెట్టి ఆ తరహా సినిమాలే రావడంతో జనాలు విసిగిపోయారు. అవుట్ డేటెడ్ అయిపోయిన ఈ జోనర్ లో లారెన్స్ 'కాంచన 3' సినిమా తీశారు.

కాంచన సిరీస్ లో భాగంగా వచ్చిన ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. నిర్మాత ఠాగూర్ మధు ఈ సినిమా రైట్స్ కోసం రూ.16 కోట్లు చెల్లించడంతో అందరూ షాక్ తిన్నారు. ఇక సినిమా రివ్యూలు నెగెటివ్ గా రావడంతో నష్టాలు తప్పవని అనుకున్నారు. కానీ ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా బి, సి సెంటర్స్ లో దూసుకుపోతుంది.

పాజిటివ్ రివ్యూలు వచ్చిన 'జెర్సీ' సినిమా బి, సి సెంటర్స్ లో డల్ గా సాగుతుంటే.. 'కాంచన 3' మాత్రం ఫుల్స్ తో రన్ అవుతోంది. తొలివారంలోనే పదహారు కోట్లు షేర్ తీసుకొచ్చిన ఈ సినిమా లాంగ్ రన్ లో పాతిక కోట్ల షేర్ సాధిస్తుందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.

తెలుగు నిర్మాత మధు ఈ సినిమాను చాలా చోట్ల సొంతంగా రిలీజ్ చేశాడు. చాలా ఏరియాల్లో లాభాలు ఆయన ఖాతాలోకి వచ్చి చేరుతున్నాయి. మొత్తానికి డబ్బింగ్ సినిమాతో ఈ నిర్మాత మంచి లాభాలనే గడించాడు. 

PREV
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?