'ఎవెంజర్స్' దెబ్బకి.. మరో వికెట్ డౌన్!

Published : Apr 27, 2019, 03:04 PM IST
'ఎవెంజర్స్' దెబ్బకి.. మరో వికెట్ డౌన్!

సారాంశం

ప్రపంచవ్యాప్తంగా మార్వేల్ సినిమా అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన 'ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్' సినిమా శుక్రవారం నాడు విడుదలైంది. 

ప్రపంచవ్యాప్తంగా మార్వేల్ సినిమా అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన 'ఎవెంజర్స్: ది ఎండ్ గేమ్' సినిమా శుక్రవారం నాడు విడుదలైంది. హిట్ టాక్ సొంతం చేసుకొని భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. ఈ సినిమా దెబ్బకి థియేటర్లో ఉన్న సినిమాలతో పాటు రిలీజ్ కావాల్సిన సినిమాలు కూడా బెంబేలెత్తిపోతున్నాయి.

'మజిలీ', 'జెర్సీ' సినిమా కలెక్షన్స్ పై ఈ సినిమా ఎఫెక్ట్ పడిందనే చెప్పాలి. కొత్తగా విడుదల కావాల్సిన సినిమాలు 'ఎవెంజర్స్'తో పోటీ ఎందుకని వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే మే 1న విడుదల కావాల్సిన 'అర్జున్ సురవరం' సినిమా 'ఎవెంజర్స్' కారణంగా వాయిదా పడింది.

ఇప్పుడు మరో సినిమా 'అభినేత్రి 2' కూడా ఇలానే వాయిదా పడింది. ప్రభుదేవామ తమన్నా జంటగా నటించిన ఈ సినిమాను ఎ.ఎల్.విజయ్ డైరెక్ట్ చేస్తున్నారు. మే 1న ఈ సినిమా విడుదల కావాల్సివుంది. తెలుగులో ఈ సినిమాకు హైప్ లేనప్పటికీ తమిళంలో కాస్త బజ్ ఏర్పడింది.

అయితే తమిళనాడు కూడా 'ఎవెంజర్స్' ప్రభంజనం ఓ రేంజ్ లో ఉండడంతో దాని ధాటికి తట్టుకోవడం కంటే వాయిదా వేసుకోవడం బెటర్ అని భావించి ఇప్పుడు సినిమాను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. థియేటర్లలో 'ఎవెంజర్స్' హవా తగ్గితేగాని కొత్త సినిమాలు విడుదలయ్యేలా లేవు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి మేనేజ్మెంట్ కోటా అని తేలిపోయిందా ? నిహారికతో నాగార్జున షాకింగ్ వీడియో వైరల్
Chiranjeevi: చిరంజీవితో నటించి సెలెబ్రిటీలని పెళ్లి చేసుకున్న హీరోయిన్లు వీళ్ళే..సుహాసిని నుంచి జ్యోతిక వరకు