నో సినిమా.. ఓన్లీ పాలిటిక్స్: షాకిచ్చిన కమల్

Published : Apr 05, 2019, 02:38 PM IST
నో సినిమా.. ఓన్లీ పాలిటిక్స్: షాకిచ్చిన కమల్

సారాంశం

కోలీవుడ్ హీరో కమల్ హాసన్ మరోసారి సినిమాలు చేయనని క్లారిటీ ఇచ్చేశాడు. ప్రస్తుతం కమల్ రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మక్కల్ నీది మయ్యాం పార్టీని స్థాపించి రెగ్యులర్ పొలిటీషియన్ గా ప్రచారాలు మొదలుపెట్టారు. 

కోలీవుడ్ హీరో కమల్ హాసన్ మరోసారి సినిమాలు చేయనని క్లారిటీ ఇచ్చేశాడు. ప్రస్తుతం కమల్ రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మక్కల్ నీది మయ్యాం పార్టీని స్థాపించి రెగ్యులర్ పొలిటీషియన్ గా ప్రచారాలు మొదలుపెట్టారు. అయితే రీసెంట్ గా ప్రచారాల్లో కమల్ తన నిర్ణయాన్ని మరోసారి అభిమానులకు తెలియజేశారు. 

గతంలో చాలాసార్లు ఈ విషయాన్నీ చెప్పినప్పటికీ  భారతీయుడు 2 ఎనౌన్స్మెంట్ ఇవ్వడంతో అభిమానులు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక సినిమాలను ఆయన వదలరని అంతా అనుకున్న సమయంలో అదే తన చివరి సినిమా అంటూ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చాడు. రీసెంట్ గా ప్రచారాల్లో తన అభిమానులకు రాజకీయ ప్రణాళికల గురించి వివరించారు. 

ఈ విషయంలో అభిమానులు నీరాశపడతారని తెలిసినప్పటికీ రాజకీయాల్లో కొనసాగాలంటే సినిమాలకు ఎండ్ కార్డ్ పెట్టాల్సిందే అని సమాధానం ఇచ్చారు. రెండు పనులు ఒకేసారి చేయడం సాధ్యం కాదంటూ.. ఫైనల్ గా తన జీవితం ప్రజా సేవకె అంకితం చేస్తాను అని కమల్ తెలియజేశారు. 

PREV
click me!

Recommended Stories

Top 10 Movies 2025: పవన్, వెంకటేష్, రాంచరణ్ లలో బాక్సాఫీస్ వద్ద ఎవరి సత్తా ఎంత ? 2025లో టాప్ 10 మూవీస్ ఇవే
Akhanda 2: అఖండ 2 రిలీజ్ కి తొలగిన అడ్డంకులు, మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ ఆ ఒక్క సమస్య ఇంకా ఉంది