
లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రధాన పాత్రలో నటించిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్ ‘విక్రమ్’. యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించారు. కామియో అపియరెన్స్ తో తమిళ సూపర్ స్టార్ సూర్య ఇరగదీశారు. ఈ ఏడాది జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేకింగ్ చేసింది. ఆడియెన్స్ నుంచి కూడా అదిరిపోయే రెస్పాన్స్ దక్కించుకుంది. యాక్షన్ పరంగా ఆడియెన్స్ కు విజువల్ ట్రీట్ అందిందనే చెప్పాలి.
తాజాగా అందిన సమాచారం ప్రకారం.. ఈ చిత్రం ఇంకా థియేటర్లలో రన్ అవుతోంది. తమిళనాడులో ఆయా సెంటర్లలో ‘విక్రమ్’ నేడు 100వ రోజును విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కమల్ హాసన్ 100 డేస్ పోస్టర్ తో అభిమానులు, ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు చెప్పారు. చిత్ర యూనిట్ కు కూడా పేరు పెరున స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. అటు అభిమానులు, ఆడియెన్స్ కూడా విక్రమ్ 100 డేస్ సెలబ్రేషన్స్ ను గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. చిత్ర యూనిట్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
భారీ స్థాయి యాక్షన్ తో ‘విక్రమ్’ ఆడియెన్స్ థియేటర్లలో దద్దరిల్లింది. అదిరిపోయే ఫైట్స్, గ్రాండ్ విజువల్స్, మైండ్ బ్లోయింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ తో చిత్రం అన్ని వర్గాల ఆడియెన్స్ ను అలరించింది. అన్ని భాషల్లోనూ హ్యూజ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని రూ.150 కోట్లతో రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్ నిర్మించారు. ఇప్పటి వరకు చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.450 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మూవీకి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే సంగీతం అందించారు.