Kamal Haasan Movie Release:రిలీజ్ డేట్ లాక్ చేసిన కమల్ హాసన్.. అనౌన్స్ మెంట్ ఎప్పుడంటే..?

Published : Mar 03, 2022, 02:51 PM ISTUpdated : Mar 03, 2022, 02:53 PM IST
Kamal Haasan Movie Release:రిలీజ్ డేట్ లాక్ చేసిన కమల్ హాసన్.. అనౌన్స్ మెంట్ ఎప్పుడంటే..?

సారాంశం

కరోనా వల్ల ఆగిపోయిన సినిమాలకు చిన్నగా మోక్షం లభిస్తుంది. షూటింగ్స్ లేట్ అయ్యి రిలీజ్ టైమ్ కు చేసుకోలేకపోయిన సినిమాల రిలీజ్ లు ఇప్పుడు వరుసగా మొదలయ్యాయి. అందులో లోకనాయకుడు కమల్ హాసన్ విక్రమ్ మూవీ కూడా రిలీజ్ కు ముస్తాబయ్యింది.   

కరోనా వల్ల ఆగిపోయిన సినిమాలకు చిన్నగా మోక్షం లభిస్తుంది. షూటింగ్స్ లేట్ అయ్యి రిలీజ్ టైమ్ కు చేసుకోలేకపోయిన సినిమాల రిలీజ్ లు ఇప్పుడు వరుసగా మొదలయ్యాయి. అందులో లోకనాయకుడు కమల్ హాసన్ విక్రమ్ మూవీ కూడా రిలీజ్ కు ముస్తాబయ్యింది. 
 

తమిళ స్టార్ హీరో.. లోకనాయకుడు కమల్ హాసన్  విశ్వరూపం 2 సినిమా తరువాత మళ్లీ వెండితెరపై కనిపించలేదు. తమిళ  రాజకీయాల్లో ఆయన బిజీ అవ్వడంతో  సినిమలకు కొంచెం గ్యాప్ ఇచ్చారు కమల్. బుల్లితెరపై బిగ్ బాస్ షో తప్పించి... కమల్ సినిమా రిలీజ్ అయ్యింది లేదు. అటు భారతీయుడు 2 సినిమా స్టార్ట్ చేసినా.. కొన్ని వివాదాల వల్ల ఆ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది.  భారతీయుడు సినిమా తరువాత ఆయన ప్రకటించిన సినిమా విక్రమ్. లాక్ డౌన్ కష్టాలను దాటుకుని షూటింగ్ చేసుకున్న ఈమూవీ సైలెంట్ గా రిలీజ్ కు రెడీ అయ్యింది. 

  అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ త్వరలోనే విక్రమ్‌ గా రానున్నాడు కమల్ హాసన్. ఖైదీ, మాస్టర్‌ లాంటి సూపర్ హిట్ సినిమాల దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ను రూపొందిస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కమల్‌తో పాటు ఈ సినిమాలో  విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా విక్రమ్‌ సినిమాలో గ్యాంగ్ స్టర్ గా కమల్ కనిపించనున్నారు. కొన్ని రోజుల క్రితం విడుదలైన టీజర్‌కుఅద్భుతమైన స్పందన వచ్చింది. కాగా తాజాగా విక్రమ్‌ సినిమా షూటింగ్‌ పూర్తైనట్లు మూవీ టీమ్ ప్రకటించింది.అంతే కాదు సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయబోతున్నారు. 

 

ఫహద్ ఫాజిల్ గన్ పేల్చే వీడియోను విడుదల చేసిన మేకర్స్..మూవీ రిలీజ్ డేట్ ను  కూడా లాక్ చేశారు. మార్చి14న విక్రమ్ చిత్రం విడుదల తేదీని ప్రకటించబోతున్నట్టు ట్విట్టర్‌ వేదికగా చిత్రబృందం ప్రకటించింది. తెలుగులో కూడా విక్రమ్ పేరుతోనే రిలజ్ కాబోతున్న ఈ సినిమాలో మలయాళ నటుడు జయరామ్ తనయుడు కాళిదాస్ జయరాం, నరేన్ , ఆంటోనీ వర్గీస్, అర్జున్ దాస్, శివానీ నారాయణన్ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. 

అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ సినిమాకు గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. కమల్ హాసన్ ఆశలన్నీ ఈసినిమాపైనే పెట్టుకున్నారు. లాంగ్ గ్యాప్ తరువాత థియేటర్లలోకి తన సినిమా వస్తుండటంతో.. చాలా జాగ్రత్తగా ఈ సినిమా  బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దాని కోసం అని బిగ్ బాస్ షో నుంచి కూడా తప్పుకున్నారు కమల్. సినిమాను దగ్గరుండి చూసుకుంటున్నారు.  

PREV
click me!

Recommended Stories

Jr NTR: చిరంజీవి తర్వాత ఎన్టీఆర్ ని టార్గెట్ చేశారా ?..సంచలన నిర్ణయం, తారక్ పేరుతో ఎవరైనా అలా చేస్తే చుక్కలే
Illu Illalu Pillalu Today Episode Dec 9: అమూల్యతో పెళ్లికి విశ్వక్ కన్నింగ్ ప్లాన్, వల్లిని నిలదీసిన రామరాజు