కమల్ హాసన్ ‘విక్రమ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్.. చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా?

Published : May 30, 2022, 04:54 PM IST
కమల్ హాసన్ ‘విక్రమ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్.. చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా?

సారాంశం

యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ తాజాగా నటించిన పవర్ ఫుల్ యాక్షన్ ఫిల్మ్ ‘విక్రమ్’. మరో మూడు రోజుల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  

లోక నాయకుడు కమల్‌ హాసన్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘విక్రమ్‌’.  ‘కార్తీ’, ‘ఖైదీ’ చిత్రాలతో తనేంటో ప్రూవ్ చేసుకున్న దర్శకుడు లోకేష్‌ కనగరాజు ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి దర్శకత్వం వహించారు. కమల్‌ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ పతాకంపై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీలో కమల్‌తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలు పోషించారు. ప్రపంచవ్యాప్తంగా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. 

మరో మూడు రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుండగా మేకర్స్ ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసంగా గ్రాండ్ గా  ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈవెంట్ పై అప్డేట్ అందిస్తూ.. రేపే ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నామని అనౌన్స్ చేశారు. హైదరాబాద్ లోని  శిల్పాకళా వేదికలో సాయంత్రం 6 గంటల నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తామన్నారు. ఈ వేడుకకు స్టార్ యాక్టర్ విక్టరీ వెంకటేశ్ చీఫ్ గెస్ట్ గా విచేస్తున్నారని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను  చకాచకా చేస్తుమన్నారు. ఈ అప్డేట్ తో అభిమానులు  ఫుల్ ఖుషీ అవుతున్నారు.   

ఇప్పటికే ‘విక్రమ్’ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగు వెర్షన్ ట్రైలర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) రిలీజ్ చేయడం విశేషం. మరోవైపు ట్రైలర్ లో అదిరిపోయే యాక్షన్స్ సీన్స్.. దద్దరిల్లిపోయేలా ఉన్న డైలాగ్స్ కు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ  సినిమా కోసం ఈగర్ ఎదురుచూస్తున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?
Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి