Kamal Haasan: 'విక్రమ్‌' హిట్ అవ్వగానే కమల్ ఇమ్మీడియట్ గా చేసిన పని ఇదే

Surya Prakash   | Asianet News
Published : Jun 15, 2022, 10:01 AM IST
Kamal Haasan: 'విక్రమ్‌' హిట్ అవ్వగానే కమల్ ఇమ్మీడియట్ గా చేసిన పని ఇదే

సారాంశం

విక్రమ్ డార్క్ మూవీ. మేకింగ్ పరంగా దర్శకుడు లోకేష్ కనకరాజ్ అద్భుతంగా తీశారు. అయితే విక్రమ్ నుంచి ఎక్సపెక్ట్ చేసిన స్దాయిలో   గ్రేట్ థియేటర్ ఎక్స్ పిరియన్స్ అందింది. సెకండాఫ్ లో కమల్ విశ్వరూపం చూసిన అభిమానులు కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్నారు.

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ సినిమాలు ఈ మధ్యకాలంలో విక్రమ్ ముందు దాకా పెద్దగా ఆడ లేదు.  వరసగా ఖైదీ, మాస్టర్ సినిమాలతో హిట్ కొట్టిన లోకేష్ కనగరాజ్ డైరక్టర్ కావటం, విజయ్ సేతుపతి విలన్ గా చేయటంతో విక్రమ్ సినిమాకు ఎక్కడలేని క్రేజ్ క్రియేట్ అయ్యింది. ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఆ బజ్ రెట్టింపు అయ్యింది. ఆ బజ్ ని సినిమా కొనసాగించిందనే చెప్పాలి. స్క్రీన్ ప్లే లో మ్యాజిక్ చేసిన లోకేషన్ కనగ రాజ్ సినిమాని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లి పెద్ద హిట్ కొట్టారు. సెకండాఫ్ లో కమల్ మ్యాజిక్ బాగా వర్కవుట్ అయ్యింది. ఈ నేపధ్యంలో కమల్ హాసన్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. తన సినిమాకు పనిచేసిన చిన్నా,పెద్ద టెక్నీషియన్స్ కు, హీరో సూర్యకు, డైరక్టర్ కు అందరికీ గిప్ట్ లు ఇచ్చాడు. అయితే సినిమా రిలీజైన వెంటనే కమల్ దృష్టి ఒకే ఒక విషయం మీద ఉంది.

అదేమిటంటే కమల్ వరస ఫ్లాఫ్ లు విశ్వరూపం 2, చీకటి రాజ్యం, ఉత్తమ విలన్ నిర్మాతగా చాలా డబ్బులు పోగొట్టుకున్నారు. ఫైనాన్సియల్ కండీషన్ అసలు బాగోలేదు. ఈ సినిమా హిట్ కొట్టకపోతే చాలా దారుణమైన ఆర్దిక స్దితి. మరో ప్రక్క తమిళనాడు ఎలక్షన్స్ లో పాల్గొంటే అక్కడా ఫెయిల్యూర్. ఎంతో నమ్మకం పెట్టుకుని సొంత ప్రొడక్షన్ లో ప్రారంభించిన శభాష్ నాయుడు సినిమా ఆగిపోయింది. తన ఆస్దులు అన్ని అమ్మినా ఇంకా యాభై కోట్లు అప్పు ఉంటుందని అంచనా.

 ఈ నేపధ్యంలో కమల్ మళ్లీ అప్పు తీసుకుని తన మీద, తన దర్శకుడు మీద నమ్మకంతో విక్రమ్ మొదలెట్టారు. సినిమా సక్సెస్ తో ఓవర్ నైట్ లో కమల్ పరిస్దితి మారిపోయింది. తన అప్పులన్నిటినీ తీరుస్తానని ఎనౌన్స్ చేసారు. దాంతో విక్రమ్ హిట్ టాక్ రాగానే తన అప్పులు వాళ్లకు కబురు పెట్టి త్వరలోనే మొత్తం సెటిల్ చేస్తానని మాట ఇచ్చి, ఆ పనిలో ఉన్నారట. అలాగే పాత అప్పులలో కొన్నిటిని సెటిల్మెంట్ కు వెళ్తున్నారట. వడ్డీలు మినహాయించమని,అసలు కట్టగలనని కబురు పంపారట. ఇలా కమల్ తనను నమ్మి అప్పులు ఇచ్చిన వారికి క్లియర్ చేసే పనిలో పడ్డారని తమిళ సిని వర్గాల సమాచారం.

ఇది కాంక్రీట్ అడవి అనుకుంటే.. ఇది కూడా అడవే. క్రైమ్ విషయానికి వస్తే డ్రగ్స్ కానీ మరొకటి కానీ.. మనిషిని వేటాడే జంతువులా మారిపోయాడు మనిషి. అనుకోకుండా ఇలాంటి అడవిలో మనమంతా బాగస్వాములుగా వున్నాం. విలన్ అనే వాడు మార్స్ నుండి దిగిరాడు. విక్రమ్ కథలో ఇలాంటి అంశాలాన్నీ చూస్తాము. ఇందులో ప్రతి పాత్రకు రెండు కోణాలు వుంటాయి. విక్రమ్ డార్క్ మూవీ. మేకింగ్ పరంగా దర్శకుడు లోకేష్ కనకరాజ్ అద్భుతంగా తీశారు. అయితే విక్రమ్ నుంచి ఎక్సపెక్ట్ చేసిన స్దాయిలో   గ్రేట్ థియేటర్ ఎక్స్ పిరియన్స్ అందింది. సెకండాఫ్ లో కమల్ విశ్వరూపం చూసిన అభిమానులు కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Samantha Honeymoon Plans, రాజ్ తో కలిసి రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేసిన సమంత, ఎక్కడికి వెళ్లబోతున్నారో తెలుసా?
49 ఏళ్ల వయసులో ఇండియాకు మెడల్ సాధించిన నటి, ఏకంగా 4 పతకాలతో మెరిసిన ప్రగతి