సింహం, పులి, చిరుత అడవికి వేటకు వెళితే.. గూస్‌బంమ్స్ తెప్పిస్తున్న కమల్‌ హాసన్‌ `విక్రమ్‌` ట్రైలర్‌

Published : May 15, 2022, 08:49 PM IST
సింహం, పులి, చిరుత అడవికి వేటకు వెళితే.. గూస్‌బంమ్స్ తెప్పిస్తున్న కమల్‌ హాసన్‌ `విక్రమ్‌` ట్రైలర్‌

సారాంశం

కమల్‌ హాసన్‌, విజయ్‌ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న `విక్రమ్‌` మూవీ ట్రైలర్‌ విడుదలైంది. ఆద్యంతం గూస్‌బంమ్స్ తెప్పిస్తుంది.

లోకనాయకుడు కమల్‌ హాసన్‌ (Kamal Haasan) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ `విక్రమ్‌`(Vikram Movie). ఆయన చాలా రోజుల తర్వాత మంచి కమర్షియల్‌ మూవీ చేస్తున్నారు. ఇందులో విజయ్‌ సేతుపతి(Vijay Sethypathi), ఫహద్‌ ఫాజిల్‌(Fahad Faasil) కీలక పాత్రలు పోషిస్తున్నారు. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రైలర్‌ (Vikram Trailer) తాజాగా విడుదలైంది. ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. చిత్ర ఆడియోతోపాటు ట్రైలర్‌ని విడుదల చేయగా, సోషల్‌ మీడియాలో, యూట్యూబ్‌లో ట్రైలర్‌ ట్రెండ్‌ అవుతుంది. ఆద్యంతం యాక్షన్‌ ప్రధానంగా సాగే ఈ ట్రైలర్‌ అభిమానులకు గూస్‌బంమ్స్ తెప్పిస్తుంది. 

ఇందులో సింహం, పులి, చిరుతపులి ఒక అడవికి వేటకు వెళితే అని కమల్‌ హాసన్‌ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభమయ్యింది. విజయ్‌ సేతుపతి, ఫహద్‌ గ్యాంగ్‌స్టర్స్ గా కనిపించనున్నట్టు తెలుస్తుంది. కమల్‌ హాసన్‌ రా ఏజెంట్‌గా కనిపిస్తారని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. ఇందులో కమల్‌, విజయ్‌, ఫహద్‌ లుక్స్ ఆద్యంతం కట్టిపడేస్తున్నాయి. ఇప్పటికే ఫస్ట్ లుక్స్, టీజర్‌ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ట్రైలర్‌ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది. కమల్‌కి చాలా రోజుల తర్వాత మంచి హిట్‌ పడబోతుందనే సంకేతాలనిస్తుంది. 

ఇక ఈ చిత్రంలోని పాటలను కూడా ఆదివారం చెన్నైలో నిర్వహించిన ఈవెంట్‌లో విడుదల చేశారు. పాటలు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. అనిరుథ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందించారు. పాటలతోపాటు ట్రైలర్‌లో బీజీఎం అదిరిపోయేలా ఉంది. రాజ్‌కమల్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ పతాకంపై కమల్‌ హాసన్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూన్‌ 3న విడుదల కాబోతుంది. మరోవైపు ఈ నెల 18న ఈ చిత్ర ట్రైలర్‌ని కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబోతున్నారు. ఓ ఇండియన్‌ సినిమా ట్రైలర్‌ కేన్స్ లో ప్రదర్శించడం ఇదే ఫస్ట్ టైమ్‌ కాబోతుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

చనిపోయే ముందు శ్రీదేవి నన్ను కలిసింది.. అప్పుడు అందరం కలిసి గెట్ టుగెదర్.!
Ram Charan Peddi Movie: మైండ్ బ్లాక్ అయ్యే సన్నివేశాలతో 'పెద్ది' ఢిల్లీ షెడ్యూల్.. లేటెస్ట్ అప్డేట్ ఇదే