కమల్ హాసన్ సినిమాల్లో పక్కాగా ఆ నటుడు ఉండాల్సిందే.. ఆయనంటే కమల్ కు ఎందుకంత సెంటిమెంట్

Published : Jun 09, 2022, 12:47 PM IST
కమల్ హాసన్ సినిమాల్లో పక్కాగా ఆ నటుడు ఉండాల్సిందే.. ఆయనంటే కమల్ కు ఎందుకంత సెంటిమెంట్

సారాంశం

కమల్ హాసన్ సినిమా అంటే ఆ నటుడు ఉండాల్సిందే. తమిళ సినిమాలను చూసే తెలుగు ప్రేక్షకులందరికీ ఈయన సుపరిచితుడే. రీసెంట్ గా విక్రమ్ సినిమాలో కూడా కమల్ తో కలిసి సందడి చేసిన ఈ నటుడెవరు..? కమల్ కు ఈయనకు ఉన్న అనుబంధం ఏంటీ..? 

క్రమ్ సినిమాలో  ఏజెంట్ ఉల్లియప్పన్ గా కనిపించిన నటుడు గుర్తున్నారు కదా.. తన నటనతో  అందరి దృష్టిని ఆకర్షించిన ఆయన కమల్ హాసన్ కు మాత్రం ఓ సెంటిమెంట్. అసలు అటువంటివి నమ్మని నాస్తికుడు కమల్ హాసన్ కదా..? మరి ఈ నటుడు సెంటిమెంట్ ఏంటీ.. అంటే.. ? ఆయన తప్పకుండా కమల్ సినిమాల్లో కనిపిస్తాడు అందుకే ఫ్యాన్స్ కమల్ కు ఆ నటుడు సెంటిమెంట్ అని ఫీలు అవుతారు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా...?  ఈయన పేరు సంతాన భారతి.

తమిళ సినిమాలను చూసే తెలుగు ప్రేక్షకులందరికీ ఈయన సుపరిచితుడే. అయితే.. ఈయన ఎక్కువగా కమల్ హాసన్ సినిమాలలో కనిపిస్తూ ఉంటారు. తమిళ నాట పేరున్న నటుడు మరియు డైరెక్టర్ కూడా. ఈయన కొన్ని టెలివిజన్ సీరియల్స్ కు కూడా దర్శకత్వం వహించారు. కామెడీ,  విలన్ రోల్స్ ను పోషించి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు సంతాన భారతి. 

సివి శ్రీధర్ లాంటి సూపర్బ్ డైరెక్టర్ దగ్గర పనిచేసినా సంతాన భారతికి కెరీర్ మొదట్లో అవకాశాలు రాలేదు. స్నేహితుడు పి.వాసుతో కలిసి ఆఫర్ల కోసం చూస్తున్న టైం లో 1981 సంవత్సరంలో పన్నీర్ పుష్పంగల్ అనే సినిమాకు అవకాశం వచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తరువాత స్నేహితుడి పేరు కలుపుకుని భారతి వాసు పేరిట అనేక సినిమాలను రూపొందించారు ఈయన. 

ఆ తరువాత ఆయన తీసిన గుణ, చిన్న మాపిళ్లై, మహానంది లాంటి సినిమాలకు మంచి ప్రశంసలు లభించాయి. ఈ క్రమంలోనే ఆయనకు కమల్ హాసన్, క్రేజీ మోహన్ లతో కూడా ఫ్రెండ్ షిప్ కుదిరింది. అది క్రమంగా బలపడుతూ వచ్చింది. అందుకే కమల్ హాసన్ ప్రతీ సినిమాలో సంతాన భారతికి ఒక క్యారెక్టర్ ఉంటుంది. అది ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉంటుంది. 

ఆయన సినిమాల్లో ఎక్కువగా కమల్ హాసన్, క్రేజి మోహన్ లు కనిపిస్తూ ఉంటారు. సినిమాలకు కలిసి పని చేస్తూ.. వారి స్నేహ బంధాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తూ వచ్చారు. ముంబై ఎక్స్ ప్రెస్, అమావాస్య చంద్రుడు, దశావతారం, బ్రహ్మ చారి వంటి సినిమాలలో కూడా వీరు  కనిపిస్తారు. 

ఇక కమల్ నటించిన మహానంది సినిమాను సంతాన భారతిని డైరెక్ట్ చేసారు. ముంబై ఎక్స్ప్రెస్ సినిమాలో కమెడియన్ గా కనిపించి మెప్పించారు భారతి. తాజాగా.. కమల్ హాసన్ విక్రమ్ సినిమాలో ఏజెంట్ ఉల్లియప్పన్ గా నటించి మెప్పించారు. తన నటనతో  అందరి దృష్టిని  తనవైపు తిప్పుకున్నారు. ఆయన క్యారెక్టర్ అందరికి గుర్తుండిపోవడంతో.. విక్రమ్  సినిమా పేరు వస్తే.. సోషల్ మీడియాలో సంతాన భారతి గురించి పెద్ద చర్చ నడుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Rithu Remuneration బిగ్ బాస్ విన్నర్ రేంజ్ లో పారితోషికం, రీతూ చౌదరి ఎలిమినేషన్ కు కారణాలు ఇవే ?
30 ఏళ్ళు మేకప్ మ్యాన్ గా పని చేసిన వ్యక్తితో అనుష్క సినిమా, గోవాకి పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చిన అగ్ర హీరో