జీఎస్టీ రద్దు చేయకుంటే సినిమాలు మానేస్తానంటున్న కమల్ హాసన్

Published : Jun 03, 2017, 10:08 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
జీఎస్టీ రద్దు చేయకుంటే సినిమాలు మానేస్తానంటున్న కమల్ హాసన్

సారాంశం

జీఎస్టీ చట్టం అమలుతో దేశమంతా ఒకే పన్ను విధానం దీనివల్ల సినిమాలకు నష్టం జరుగుతుందంటున్న పరిశ్రమ వర్గాలు జీఎస్టీ రద్దు చేయకుంటే సినిమాలు మానేస్తానంటున్న మహానటుడు

సినిమాలపై 28 శాతం జీఎస్టీ పన్ను విధించడాన్ని సినీ పరిశ్రమ జీర్ణించుకోలేకపోతోంది. ఇప్పటికే రకరకాల ఒత్తిళ్లతో సతమతమవుతున్న సినిమా పరిశ్రమ జీఎస్టీ వల్ల తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని పలు సినీ పరిశ్రమలు జీఎస్టీని ఖండిస్తున్నాయి. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి తెలంగాణ ఫిలిం ఛాంబర్ తరపున ఆర్ కే గౌడ్ ఇదే విషయం చెప్పారు. రీజనల్ లాంగ్వేజీ సినిమాలకు జీఎస్టీ వర్తింపజేస్తే తీవ్రంగా నష్టపోతాయన్నారు. 

 

తాజాగా 28 శాతం పన్ను విధించటంపై మహానటుడు కమల్ హాసన్ స్పందించారు. ప్రభుత్వం సినీ పరిశ్రమపై విధిస్తున్న పన్ను శాతాన్ని సవరించకపోతే తాను సినిమాలు చేయాటం మానేయాల్సి వస్తుందని తెలిపారు. జూలై 1 నుంచి అమలులోకి రానున్న జీఎస్టీ పన్ను విధానంపై ఆయన వ్యతిరేతక వ్యక్తం చేశారు. ఒక దేశం ఒక పన్నును తాను స్వాగతిస్తున్నానని అయితే సినీ రంగంపై 28 శాతం పన్ను విధిస్తే ప్రాంతీయ సినీ పరిశ్రమలకు తీవ్ర నష్టాలు వస్తాయని తెలిపారు.



రీజినల్ సినిమాలో జాతీయ, అంతర్జాతీయ సినిమాలతో పోల్చి చూడకూడదన్న కమల్.. నిత్యావసరాల మాదిరి పన్ను విదానం సినిమా రంగంపై విదించటం సరికాదన్నారు.  పెద్ద నోట్ల రద్దుతో సినీ పరిశ్రమ తీవ్ర ఇబ్బందులకు గురైందని ఇప్పుడు జీఎస్టీ 28 శాతం అమల్లోకి వస్తే మరిన్ని నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాట క్లీ యు సర్టిఫికేట్ తో తమిళ పేరుతో రిలీజ్ అయ్యే సినిమాలకు పన్ను మినహాయింపు ఇస్తున్నారు. జీఎస్టీ అమలైతే.. ఈ విధానం కొనసాగించటం కుదరదు. దీంతో తమిళ సినీ ప్రముఖులు సినీ రంగంపై విధిస్తున్న 28 శాతం జీఎస్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Ram Charan: కెరీర్ లో 2 సార్లు కాస్ట్లీ మిస్టేక్స్ చేసిన రాంచరణ్.. చిరంజీవి కూడా ఏం చేయలేకపోయారా ?
Rithu Chowdary Eliminate: చివరి నిమిషంలో బిగ్‌ బాస్‌ షాకింగ్‌ ట్విస్ట్, రీతూ ఎలిమినేట్‌.. కారణం ఇదే