అభిమానులతో సెల్ఫీ.. ఆసుపత్రిలో కమల్‌ హాసన్‌!

Published : Mar 21, 2021, 01:39 PM IST
అభిమానులతో సెల్ఫీ.. ఆసుపత్రిలో కమల్‌ హాసన్‌!

సారాంశం

కమల్‌ హాసన్‌తో సెల్ఫీ తీసుకునేందుకు అభిమానులు ఎగబడ్డారు. దీంతో కమల్‌ హాసన్‌ ఆసుపత్రిలో జాయిన్‌ అయిన సంఘటన తాజాగా చోటు చేసుకుంది. ప్రస్తుతం కమల్‌ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. 

కమల్‌ హాసన్‌తో సెల్ఫీ తీసుకునేందుకు అభిమానులు ఎగబడ్డారు. దీంతో కమల్‌ హాసన్‌ ఆసుపత్రిలో జాయిన్‌ అయిన సంఘటన తాజాగా చోటు చేసుకుంది. ప్రస్తుతం కమల్‌ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. తమిళనాడులో ఎన్నికలు ప్రకటించిన నేపథ్యంలో ఆయన తాను ప్రారంభించిన మక్కల్‌ నీది మయ్యం(ఎంఎన్‌ఎం) పార్టీ నుంచి ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో స్పీడ్‌ పెంచారు. అందులో భాగంగా కమల్‌ హాసన్‌ ప్రచారం ముమ్మరం చేశారు. 

ప్రస్తుతం ఆయన కోయంబత్తూర్‌ నుంచి పోటీ చేస్తున్నారు. అందులో భాగంగా అక్కడ ప్రచారం చేస్తున్నారు. మార్నింగ్‌ వాక్‌లో భాగంగా అక్కడి స్థానికులతో ముచ్చటించారు. ఈ విషయం తెలిసిన అభిమానులు ఒక్కసారిగా కమల్‌ వద్దకు చేరుకున్నారు. ఆయనతో ఫోటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు. వచ్చిన అందరికి ఓపికగా సెల్ఫీలు దిగారు. అయితే జనం పెరిగారు. తోపులాట జరిగింది. ఓ వ్యక్తి కమల్‌ కాలిని తొక్కాడు. ఈ ఏడాది ప్రారంభంలో కమల్‌ అదే కాలికి ఆపరేషన్‌ జరిగింది. దీంతో ఆయన నొప్పితో విలవిలలాడిపోయాడు. 

నొప్పి పెరగడంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. కాలి గాయం పెరిగిందా అనే టెన్షన్‌లో ఎక్స్ రే తీయగా బాగానే ఉందని, ఆయన ఆరోగ్యం కూడా నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కమల్ విశ్రాంతి తీసుకుంటున్నారు. కమల్‌ హాసన్‌ నటిస్తున్న `భారతీయుడు 2` ఆగిపోయిన విషయం తెలిసిందే. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో `విక్రమ్‌` అనే చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో ఈ చిత్ర షూటింగ్‌ని కూడా వాయిదా వేశారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్
2025లో నిర్మాతలను భయపెట్టిన టాప్ 4 డిజాస్టర్ సినిమాలు