బిగ్‌బాస్‌3 విన్నర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ హీరోగా సినిమా.. `చిచ్చా` టైటిల్‌ సాంగ్‌ వైరల్‌

Published : Mar 21, 2021, 09:20 AM IST
బిగ్‌బాస్‌3 విన్నర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ హీరోగా సినిమా.. `చిచ్చా` టైటిల్‌ సాంగ్‌ వైరల్‌

సారాంశం

బిగ్‌బాస్‌  4 కంటెస్టెంట్‌ సోహైల్‌ హీరోగా సినిమాని ప్రకటించారు. మరోవైపు బిగ్‌బాస్‌4 విన్నర్‌ అభిజిత్‌ సైతం హీరోగా సినిమాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. తాజాగా బిగ్‌బాస్‌ 3 విన్నర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ హీరోగా సినిమాని ప్రకటించి ఆశ్చర్యానికి గురి చేశాడు. 

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్ హీరోగా రాణిస్తున్న సందర్భాలు చాలా తక్కువ. ఇప్పుడిప్పుడే ఆ దిశగా వారికి అవకాశాలు వస్తున్నాయి. బిగ్‌బాస్‌  4 కంటెస్టెంట్‌ సోహైల్‌ హీరోగా సినిమాని ప్రకటించారు. మరోవైపు బిగ్‌బాస్‌4 విన్నర్‌ అభిజిత్‌ సైతం హీరోగా సినిమాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. తాజాగా బిగ్‌బాస్‌ 3 విన్నర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ హీరోగా సినిమాని ప్రకటించి ఆశ్చర్యానికి గురి చేశాడు. `చిచ్చా` పేరుతో రూపొందుతున్నీ చిత్రాన్ని ప్రకటిస్తూ టైటిల్‌ సాంగ్‌ని విడుదల చేశారు. తెలంగాణ యాసతో సాగే ఈ పాట ఆకట్టుకుంటుంది. 

ఆర్.ఎస్. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఆయన హీరోగా మల్లిక్ కందుకూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి సంబంధించిన సినిమా టైటిల్ మరియు మోషన్ పోస్టర్‌ని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి. హరీష్ రావు సిద్దిపేటలో లాంచ్ చేశారు. ఇటీవల రాహుల్ సిప్లిగంజ్ అతని మిత్రుడు శ్రీకాంత్ ఇద్దరు కలిసి క్రియేట్ చేసిన 'ఊకో కాకా' (మెన్స్ వేర్) బ్రాండ్ స్టోర్‌ని మంత్రి హరీష్ రావు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక 'చిచ్చా' టైటిల్ సాంగ్ ని రాహుల్ సిప్లిగంజ్ అభిమానులు విడుదల చేయడం గమనార్హం. మరోవైపు రాహుల్‌ సిప్లిగంజ్‌ సింగర్‌గానూ రాణిస్తున్న విషయం తెలిసిందే. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్