అల్లు అర్జున్‌తో ఢీ కొనబోతున్న భయంకరమైన విలన్‌ ఫాహద్‌ ఫాజిల్‌ అట.. కన్ఫమ్‌

Published : Mar 21, 2021, 10:44 AM IST
అల్లు అర్జున్‌తో ఢీ కొనబోతున్న భయంకరమైన విలన్‌ ఫాహద్‌ ఫాజిల్‌ అట.. కన్ఫమ్‌

సారాంశం

`పుష్ప` చిత్రంలో బన్నీ పుష్పరాజ్‌ పాత్రలో కనిపించనున్నారు. ఎర్రచందనం స్మిగ్లింగ్‌ ప్రధానంగా సినిమా సాగుతుందని తెలుస్తుంది. ఇందులో బన్నీ పూర్తి డీ గ్లామర్ రోల్‌లో, మాస్‌ క్యారెక్టర్‌గా కనిపించబోతున్నారు. ఇదిలా ఉంటే ఇందులో నటించే విలన్‌ని ప్రకటించింది చిత్ర బృందం. 

అల్లు అర్జున్‌ ప్రస్తుతం `పుష్ప` చిత్రంలో నటిస్తున్నారు. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. ఇందులో బన్నీ పుష్పరాజ్‌ పాత్రలో కనిపించనున్నారు. ఎర్రచందనం స్మిగ్లింగ్‌ ప్రధానంగా సినిమా సాగుతుందని తెలుస్తుంది. ఇందులో బన్నీ పూర్తి డీ గ్లామర్ రోల్‌లో, మాస్‌ క్యారెక్టర్‌గా కనిపించబోతున్నారు. ఇదిలా ఉంటే ఇందులో నటించే విలన్‌ని ప్రకటించింది చిత్ర బృందం. 

జాతీయ అవార్డు విన్నర్‌, మలయాళ స్టార్‌ హీరో, మాలీవుడ్‌ పవర్‌ హౌజ్‌ ఫాహద్‌ ఫాజిల్‌ని విలన్‌గా ఎంపిక చేశారు. ఆయన ఇందులో భయంకరమైన విలన్‌గా కనిపించబోతున్నారట. పుష్పరాజ్‌ ఢీ కొట్టబోతున్న అతి భయంకరమైన విలన్‌ ఫాహద్‌ ఫాజిల్‌ అనేలా చిత్ర బృందం ప్రొజెక్ట్ చేస్తుంది. అయితే గతంలో ఇందులో విలన్‌ పాత్ర కోసం విజయ్‌ సేతుపతిని ఎంపిక చేశారు. కానీ డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి రకరకాల పేర్లు వినిపించాయి. కానీ ఊహించని విధంగా మలయాళ నటుడు ఫాహద్‌ ఫాజిల్‌ని ఎంపిక చేయడం విశేషం. 

దీంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. జనరల్‌గా ఫాహద్‌ ఓ సినిమా ఒప్పుకున్నారంటే అది చాలా బలమైన కథతో ఉంటుంది. ఆయన పాత్ర అంతే పవర్‌ ఫుల్‌గా ఉంటుంది. ఈ సినిమాకి ఒప్పుకున్నారంటే కచ్చితంగా ఇది బిగ్గెస్ట్ విలన్‌ రోల్‌ కాబోతుందని చెప్పొచ్చు. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మలయాళంలో బన్నీకి మంచి క్రేజ్‌, ఇమేజ్‌, మార్కెట్‌ ఉన్నాయి. ఇప్పుడు ఈ చిత్రంలో మలయాళ హీరోనే నటించడంతో అక్కడ మార్కెట్‌కి మరింత కలిసొస్తుందని చెప్పొచ్చు.  దీన్ని పాన్‌ ఇండియా సినిమాగా తెలుగు, తమిళం, మలయాళం,  కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్