
విక్రమ్ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు లోకనాయకుడు కమల్ హాసన్. వరుస సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు. అటు పొలిటికల్ గా యాక్టీవ్ గా ఉంటూనే.. ఇటు సినిమాలు వరుసగా కంప్లీట్ చేస్తున్నాడు. ఈక్రమంలోనే ఆయన శంకర్ డైరెక్షన్ లో భారతీయుడు సినిమాకు సీక్వెల్ చేస్తున్నాడు. దాదాపు పదిహేను ఏళ్లకు ముందు వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఈసినిమా తెరకెక్కుతోంది. అయితే కొన్ని కారణాలు.. ప్రమాధాల వల్ల చాలా కాలం ఈసినిమాకు బ్రేక్ పడింది. దాంతో రామ్ చరణ్ తో సినిమాను స్టార్ట్ చేశాడు శంకర్. రామ్ చరణ్ మూవీ సంగం షూటింగ్ అయిపోగానే.. అటు భారతీయుడు2 వివాదాలు అన్ని క్లియర్ అయ్యాయి. దాంతో శంకర్ ఆ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ చేయాల్సి వచ్చింది.
ఇక ఈక్రమంలో భారతీయుడు షూటింగ్ స్టార్ట్ అయ్యింది అని తెలిసి.. సినిమా కోసం వెయ్యి కళ్ళతో ఎదరు చూస్తున్నారు ఫ్యాన్స్. కనీసం చిన్న అప్ డేట్ అయినా ఇస్తారేమో అని ఎదురు చూస్తున్నవారికోసం.. లోకనాయకుడు కమల్ హాసన్ చిన్న హిట్ ఇచ్చాడు. చరణ్ సినిమాకు 30 రోజుల సెలవు ప్రకటించిన శంకర్.. ఇండియాన్2 సినిమాను సూపర్ ఫాస్ట్ గా పరిగెత్తిస్తున్నాడు. ఈక్రమంలో ఈ సినిమా అప్‌డేట్ గురించి ఎదురుచూస్తున్న అభిమానులకు క్లారిటీ ఇచ్చాడు కమల్ హాసన్. కమల్ హాసన్ మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. ఇండియన్ 2ను త్వరగా పూర్తి చేసేందుకు మా టీం రాత్రి, పగలు తీవ్రంగా కష్టపడుతుందని చెప్పాడు. త్వరలోనే గుడ్ న్యూస్ చెపుతామన్నారు కమల్.
కమల్ చెప్పిన ఈ మాటతో ఫ్యాన్స్ లో హోప్ స్టార్ట్ అయ్యింది. షూటింగ్ ను చాలా త్వరగా పూర్తి చేస్తారన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. ఇక ఈసినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఇండియన్ 2 చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. అటు రామ్ చరణ్ 15 సినిమాను కూడా తెరకెక్కిస్తున్నాడు శంకర్.
ఇక ఈసినిమా తరువాత కూడా వరుస సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు కమల్ హాసన్. భారతీయుడు 2 తరువాత తన 234 వ సినిమాను మణిరత్నం డైరెక్షన్ లో చేయబోతున్నాడు. అటు మణిరత్నం కూడా పొన్నియన్ సెల్వన్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈక్రమంలో ఆసినిమా కంప్లీట్ అవ్వగానే కమల్ సినిమాను లైన్ చేయబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే కమల్ సినిమా కోసం మణిరత్నం టీమ్ పని మొదలు పెట్టిందని సమాచారం