తెలంగాణ బ్యాక్ గ్రౌండ్ తో బాలకృష్ణ సినిమా..? పని మొదలెట్టిన అనిల్ రావిపూడి

Published : Mar 01, 2023, 09:14 PM IST
తెలంగాణ బ్యాక్ గ్రౌండ్ తో బాలకృష్ణ సినిమా..? పని మొదలెట్టిన అనిల్ రావిపూడి

సారాంశం

ఈసారి కాస్త డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు నటసింహం నందమూరి బాలకృష్ణ. ఎప్పటిలా కాకుండా గెటప్ లోను.. డైలాగ్స్ లోనూ.. బాడీలాంగ్వేజ్ లో కూడా డిఫరెంన్స్ కనిపించేలా సినిమా చేయబోతున్నాడట. ఇంతకీ విషయం ఏంటంటే..? 

వరుస సినిమాలతో దూకుడు మీద ఉన్నాడు నటసింహం నందమూరి బాలకృష్ణ. వరుస విజయాలతో జోరుమీద ఉన్నాడు. ఒక సినిమా అవ్వకముందే... మరోసినిమాకు సన్నాహాలు చేసుకుంటూనే ఉన్నాడు బాలయ్య బాబు. ఈక్రమంలోనే రీసెంట్ గా  మలినేని గోపీచంద్ డైరెక్షనం లో 107 సినిమాగా వీరసింహారెడ్డి ని తెరకెక్కించి.. బారీ కలెక్షన్స్ ను సాధించిన బాలకృష్ణ.  సినిమాతో సూపర్ సక్సెస్ సాధించిన బాలయ్య.. నెక్ట్స్ అనిల్ రావిపూడితో తన 108వ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ళబోతున్నాడు.  ఈ క్రమంలోనే ఈసినిమాపై నరకరకాల వార్తలు బయటకు వస్తున్నాయి. 

బాలకృష్ణ ఈసినిమాలో  కొత్తగా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ బాలయ్య బాబు రాయలసీమ యాస,భాష, లాంగ్వేజ్ తోనే ఎక్కువ సినిమాలు చేశారు. కత్తీ,గొడ్డలి లాంటి ఆయుధాలతో దుమ్ము రేపారు. ఇక ఈసారి.. ఆ ఫార్ములాకు ఆపోజిట్ గా.. తెలంగాణ యాసలో బాలయ్య మాట్లాడబోతున్నారట.. డైలాగ్స్ చెప్పబోతున్నారట.. తెలుంగాణకు సబంధించిన గెటప్ లోనే ఆయన కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. అనిల్ రావిపూడి బాలయ్య కోసం ప్రత్యేకంగా ఆ పాత్రను డిజైన్ చేసినట్టు సమాచారం. 

అంతే కాదు ఈ సినిమాలో బాలయ్య 40 ఏళ్ల వయసు పైబడిన వ్యక్తిగా .. జైల్లో 14 ఏళ్ల శిక్షను అనుభవించి తిరిగి వచ్చిన 60 ఏళ్ల వ్యక్తిగా రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించనున్నారని సమాచారం. ఇక ఈసినిమాలో కూడా అన్ని సినిమాల మాదిరిగా.. అనిల్ రావిపూడి మార్క్  కామెడీ టచ్ కాస్త కలిపి చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈసినిమా కోసం చాలా కాలంగా వర్క్ జరుగుతోది. అన్నింటికంటే కొత్తగా ఉండాలని అనిల్ ఈ పాత్రకోసం ఎక్కవ టైమ్ కేటాయించినట్టు తెలుస్తోంది. 

ఇక షైన్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాలో మరోసారి ప్రగ్యా జైస్వాల్ బాలకృష్ణ సరసన ఆడిపాడబోతుననట్టు సమాచారం. ఇక అఖండా, వీరసింహారెడ్డి సినిమాలతో సూపర్ ఫామ్ లో ఉన్న బాలయ్య.. ఈసినిమా హిట్ కొట్టి హ్యాట్రిక్ రికార్డ్ ను మరోసారి తన ఖాతాలో వేసుకోవాలి అని చూస్తున్నట్టు సమాచారం. ఇక అనిల్ తో సినిమా తరువాత బాలయ్య.. పూరీ జగన్నాథ్ తో సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్ట తెలస్తోంది. ఇక చూడాలి ఈ సినిమాలో తెలంగాణా యాసను బాలయ్య బాబు ఎలా పండిస్తారో. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?
బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ ఫినాలే, అభిమానులకు పోలీసుల వార్నింగ్..? అన్నపూర్ణ స్టూడియో ముందు ప్రత్యేకంగా నిఘ