యాంకర్ తీన్మార్ సావిత్రి పేరుతో ఘరానా మోసం... ఫ్యాన్స్ కు వార్నింగ్ ఇచ్చిన శివజ్యోతి

Published : Mar 01, 2023, 08:06 PM ISTUpdated : Mar 01, 2023, 08:11 PM IST
యాంకర్ తీన్మార్ సావిత్రి పేరుతో ఘరానా మోసం... ఫ్యాన్స్ కు వార్నింగ్ ఇచ్చిన  శివజ్యోతి

సారాంశం

యాంకర్ శివజ్యోతి అలియాస్ తీన్ మార్ సావిత్రి పేరుతో ఘరానా మోసం జరిగింది. లబోదిబోమంటూ ఆ బాధితుడు బుల్లితెర నటిని సంప్రదించగా.. ఆమె ఏమన్నదంటే..?   

ఈ మధ్య సెలబ్రిటీల పేరుతో ఘరానా మోసాలు జరగడం పరిపాటిగా మారింది.సెలబ్రిటీల పేర్లు చెప్పుకుని గట్టిగా డబ్బుులు దండుకుంటున్నారు. ఆన్ లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండండి అని పోలీసులు చెపుతున్నా..ఇంకా మోసగాళ్ల గుప్పెట్లో చిక్కుకుంటూనే ఉన్నారు సామాన్యులు. చాలా మంది సెలబ్రిటీ పేరుతో వచ్చిన లింక్ లను ఓపెన్ చేసి.. వేలు,లక్షలు పోగొట్టుకున్నవారు ఉన్నారు. ఇన్ని జరుగుతున్నా.. ఇంకా మోసపోతున్నారు నెటిజన్లు. ఈక్రమంలోనే యాంకర్ శివజ్యోతి పేరుతో భారీ మోసం బయటపడింది. 

హుస్సేన్ అనే యువకుడు యాంకర్  శివ జ్యోతికి పెద్ద ఫ్యాన్. ఆమె ఛానల్ ను ఫాలో అవుతూ ఉంటాడు. అంతే కాదు ఆమె వీడియోలు క్రమం తప్పకుండా చూస్తాడు.  యూట్యూబ్ ఛానల్ ద్వారా రివార్డ్స్ పాయింట్స్ వచ్చాయి అని టెలిగ్రామ్ ద్వారా ఓ లింక్ వచ్చింది.. దీంతో  హుస్సేన్  నిజంగానే రివార్డ్ పాయింట్స్ వచ్చాయనుకున్నాడు.. హ్యాపీగా ఆ లింక్ క్లిక్ చేశాడు.. అయితే అక్కడే చిన్న మతలబ్ పెట్టారు కేటుగాళ్లు.. ఈ రివార్డ్స్ అందుకోవాలి అంటే 1000 రూపాయలు  కట్టాలని సైబర్ నేరగాళ్లు చెప్పారు.. దాంతో రివార్డ్ పాయింట్స్ వస్తాయి అన్న ఆనందంలో వారు చెప్పినట్లుగానే హుస్సేన్ డబ్బులు ఇచ్చాడు.

ఇక మరో వల వేసిన సైబర్ నేరగాళ్ళు.. మళ్లీ ఇంకో పేరు చెప్పి మరో 3వేలు కట్టమన్నారు.. అప్పటికీ  అది మోసం అని తెలుసుకోలేకపోయాడు హుస్సేన్.. అడిగినంతా కట్టేశాడు. ఇక హుసేన్ అమాయకత్వాన్ని అలుసుగా తీసుకున్న సైబర్ నేరగాళ్లు.. వెంటనే మరో 6 వేలు కడితే రివార్డ్ పాయింట్స్ వస్తాయని అన్నారు. దాంతో పాయింట్స్ వస్తాయి కదా అన్న ఆనందంలో.. తాను ట్రాప్ లో పడ్డాను అన్న సంగతి మరిచిపోయాడు హుసేన్.. ఆరువేలు కూడా కట్టాడు. రౌండ్ ఫిగర్ 10 వేలు అయిపోగానే.. కేటుగాళ్ళు సైలెంట్ అయ్యారు. రివార్డ్ పాయింట్స్ రాకపోవడంతో.. మోసపోయాను అని అప్పుడు గుర్తించాడు హుస్సేన్. 

 ఇక లబోదిబోమంటూ.. శివజ్యోతికి  సోషల్ మీడియా ద్వారా విషయం వెల్లడించాడు హుస్సేన్. దాంతో ఆమె తన పేజ్ నుంచి స్పందించింది. ఇలాంటి ఆన్ లైన్ మోసాలు జరుగుతున్నా.. చూసుకోకపోవడం బాధాకరం అన్నారు ఆమె. అంతే కాదు తన పేరుతో ఎలాంటి రివార్డ్ పాయింట్స్ ఇవ్వడంలేదని .. దయచేసి ప్యాన్స్ గుర్తించాలి అన్నారు. నా విషయంలోనే కాదు.. ఏ ఆన్ లైన్ ట్రాప్ లో పడకుండా జాత్రత్త పడాలంటూ  ఫ్యాన్స్ కు జాగ్రత్తలు చెప్పింది శివజ్యోతి. 
 

PREV
click me!

Recommended Stories

Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?
Bigg Boss 9: పాపం ఇమ్మాన్యుయల్... టాప్ 3 కూడా మిస్, ఖుషీలో డీమాన్ పవన్